ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Himachal polls: కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో 8 మంది..?

ABN, First Publish Date - 2022-11-08T16:15:48+05:30

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో తమకు మరోసారి విజయం తథ్యమని బీజేపీ భావిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగా, కాంగ్రెస్ గెలిస్తే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారనే విషయం తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నుంచి ఇంకా ఎలాటి స్పష్టత రాలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల హిమాచల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై ఛలోక్తులు విసిరారు. ఆ పార్టీ నుంచి సీఎం పదవిని ఆశిస్తున్న వారు 8 మందికి పైనే ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ధీటుగా జవాబిచ్చారు.

''కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ సీఎం కావాలని కోరుకుంటారు. 8 మంది సీఎం అభ్యర్థుల గురించి ఆయన (అమిత్‌షా) చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ మందే ఉండవచ్చని నేను చెప్పదలచుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత చక్కగా పరిఢవిల్లుతోందో చెప్పడానికి ఇదే నిదర్శనం'' అని ధర్మశాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుధీర్ శర్మ తెలిపారు. కాగా, ప్రధానంగా కనీసం ముగ్గురు నేతల నుంచి సీఎం పదవిని పోటీ ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వీరిలో సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ప్రతిభా సింగ్ ముందు వరుసలో ఉన్నారు.

సుఖ్విందర్ సింగ్ సుఖు:

సెంట్రల్ హిమాచల్‌లోని నదౌన్ సీటు నుంచి సుఖ్విందర్ సింగ్ సుఖు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సీఎం పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉండవచ్చు. సీఎం రేసులో ఉన్నట్టు అధికారికంగా ఆయన చెప్పనప్పటికీ, పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

ముఖేష్ అగ్నిహోత్రి

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అయిన అగ్నిహోత్రి నైరుతి హిమాచల్‌లోని హరోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2003లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎల్‌పీ నేతగా ఎన్నికయ్యారు. సీఎం పోస్టుకు ఆయన కూడా ప్రధాన పోటీదారని చెబుతున్నారు.

ప్రతిభా సింగ్

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత వీరభద్ర సింగ్ సతీమణి. సిట్టింగ్ ఎంపీ అయినందున ఆమె ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సెంట్రల్ హిమాచల్‌లోని మండి నుంచి 2004లో లోక్‌సభకు తొలిసారి ఆమె ఎన్నికయ్యారు. 2013 ఉప ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి జైరామ్ ఠాకూర్‌‌ను ఓడించారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి అనంతరం ఎంపీగా ప్రతిభా సింగ్ ఎన్నికయ్యారు.

ఆషా కుమారి

నార్త్-వెస్ట్ హిమాచల్‌లోని డల్హౌసి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆషా కుమారి ఎన్నికయ్యారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అప్పట్లో పంజాబ్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా ఆమె ఉన్నారు. హిమాచల్‌లో గెలిస్తే ఆమెకు కీలక పదవి (సీఎం) ఇచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ జోస్యం చెప్పారు.

కౌల్ సింగ్ ఠాకూర్

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నేత కౌల్ సింగ్ ఠాకూర్. మండిలోని డ్రాంగ్ నియోజకవర్గం నుంచి ఒకటి రెండు సందర్భాల్లో మినహాయిస్తే ఐదు దశాబ్దాలుగా ఆయన గెలుస్తున్నారు. 1973-1977 మధ్య మండి సదర్ పంచాయత్ సమితి చైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ చైర్మన్‌గా (క్యాబినెట్ ర్యాంక్) పనిచేశారు. ఆరోగ్యం, పార్లమెంటరీ వ్యవహారాల ఇండిపెండెంట్ చార్జ్‌గా వ్యవహరించారు. 1985-90 మధ్య విధాన సభ స్పీకర్‌గా పనిచేశారు.

Updated Date - 2022-11-08T16:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising