ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Elections: మీ ఖాతా తెరుచుకోదన్న అమిత్‌షా

ABN, First Publish Date - 2022-11-30T14:47:15+05:30

గుజరాత్‌లో అధికారంలోకి రాగలమన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న ఆశలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నీళ్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గుజరాత్‌లో అధికారంలోకి రాగలమన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న ఆశలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit sha) నీళ్లు చల్లారు. ''కనీసం మీ పార్టీ ఖాతా కూడా తెరుచుకోదు'' అంటూ పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన బలంగా చెప్పారు. యాంటీ-రేడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేయడమనేది మంచి చొరవతో తీసుకునే చర్చ అని, ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా దీనిని పరిశీలించవచ్చని చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన కృషి, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి చెప్పడం వంటి కారణాల వల్లే అక్కడి ప్రజలు 27 ఏళ్ల నుంచి బీజేపీపై నమ్మకం చాటుకుంటున్నారని షా అన్నారు. ''గుజరాత్‌లో బీజేపీ అసాధారణ విజయాన్ని నమోదు చేసుకోనుంది. ప్రజలకు మా పార్టీపైన, మా నేత నరేంద్ర మోదీపైన ఎంతో నమ్మకం ఉంది'' అని చెప్పారు.

"ఆప్" లేనే లేదు...

గుజరాత్ ఎన్నికల్లో 'ఆప్' అడుగుపెట్టడంపై మాట్లాడుతూ, ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని, అయితే ఆ పార్టీని ఆదరించాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. ''ఆప్ అనేది గుజరాత్ ప్రజల మనస్సుల్లో లేదు. ఎన్నికల ఫలితాలు వరకూ వేచిచూద్దాం. గెలిచి అభ్యర్థుల జాబితాలో ఆప్ ఉండకపోవచ్చు'' అని షా అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన విపక్ష పార్టీయని, అయితే ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుందని చెప్పారు.

రాహుల్‌పై..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై అడిగిన ప్రశ్నకు షా సమాధానిమిస్తూ, నిలదొక్కుకునే ప్రయత్నాలు రాజకీయాల్లో తప్పవని అన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ కష్టపడుతుండాలని, ఎవరైనా కష్టపడుతున్నారంటే అది మంచిదేనని అన్నారు. నిలకడైన ప్రయత్నాలు చేసినప్పుడే రాజకీయాల్లో ఫలితాలు బాగుంటాయని, ఏమి జరుగుతుందో వేచిచూద్దామని ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర ఎన్నికల్లో ఉగ్రవాదం వంటి జాతీయ అంశాలను బీజీపీ లేవనెత్తడంపై విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టివేశారు. జాతీయ భద్రత అనేది ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలకమైన అంశమేనని అన్నారు. ''జాతీయ భద్రతతో గుజరాత్‌కు సంబంధం లేదా? గుజరాత్ భద్రత, జాతీయ భద్రత రెండూ వేర్వేరు అంశాలా? దేశం సురక్షితంగా లేకుంటే గుజరాత్ ఒక్కటే ఎలా సురక్షితంగా ఉండగలుగుతుంది? ఆ దష్ట్యా ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాతీయ భద్రత అనేది కీలకాంశంగానే తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఏజెన్సీల దుర్వినియోగం ఆరోపణలపై...

రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొలపడం ద్వారా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్‌షా ఘాటుగా స్పందించారు. దేశంలో స్వతంత్ర, తటస్థ న్యాయవ్యవస్థ ఉందని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరిగిందని అనుకుంటే వాళ్లు న్యాయవ్యవస్థను ఆశ్రయించవచ్చని అన్నారు. తగిన సమాచారం, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆధారాలు, ముఖ్యంగా యువతను టెర్రరిజం వైపుకు పురిగొల్పుతున్నారనే నిర్దారణకు వచ్చిన తర్వాతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను మోదీ ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి కూడా పీఎఫ్ఐను నిషేధించాలనే డిమాండ్లు వచ్చాయన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలను కానీ, అందుకు పాల్పడే సంస్థలను గానీ మోదీ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణం...

ఎన్నికలపై ద్రవ్యోల్బణం ప్రభావంపై అడిగినట్టు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, అయితే ఇండియాపై ఆ ప్రభావం తక్కువేనని అమిత్‌షా చెప్పారు. కోవిడ్ తర్వాత ఆర్థిక మందగమనం అనేది అంతటా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే V-shaped రికవరీ‌ని సాధించిందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని సమర్ధవంతంగా ఇండియా ఎదుర్కోగలదనే నమ్మకం తనకుందని, సామాజిక జీవనంపై ద్రవ్యోల్బణం ప్రభావం మన దేశంలో తక్కువగానే ఉందని చెప్పారు.

మళ్లీ సీఎం ఆయనేనా?

గుజరాత్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారా అనే ప్రశ్నకు, గుజరాత్ ప్రగతికి మోదీ వేసిన బాటను భూపేంద్ర పటేల్ సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని సమాధానమిచ్చారు.

Updated Date - 2022-11-30T14:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising