Gujarat Election: రికార్డు స్థాయిలో ఓటింగ్ చేయండి, బీజేపీని నెగ్గించండి: మోదీ
ABN, First Publish Date - 2022-11-20T14:22:26+05:30
గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రతి బూత్‌లోనూ నెగ్గించి ఘన విజయాన్ని చేకూర్చాలని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల..
వెరావల్: గుజరాత్ ఎన్నికల్లో (Gujarat Elections) భారతీయ జనతా పార్టీని (BJP) ప్రతి బూత్‌లోనూ నెగ్గించి ఘన విజయాన్ని చేకూర్చాలని ప్రధానమంత్రి మోదీ (Narendra Modi) విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజైన ఆదివారంనాడు వెరవల్ టౌన్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. పోలింగ్ రోజు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి గత ఓటింగ్ శాతం రికార్డులు తిరగరాయాలని కోరారు.
నా కోసం ఆ పని చేస్తారా?
గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఈనెల 1,5వ తేదీల్లో జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు బీజేపీ అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారం సాగించారు. ''ఇక్కడి ప్రతి బూత్‌లోనూ బీజేపీని గెలిపించండి. నా కోసం ఆ పని చేస్తారా? అన్ని పోలింగ్ బూత్‌లలో విజయం సాధించడంపై నేను దృష్టి సారించాను. ఇది సాధించడంలో మీరు సహకరిస్తే ఇక్కడ్నించి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు'' అని మోదీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీలోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతగా డిసెంబర్ 1న 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. రెండో విడతగా డిసెంబర్ 5న 93 స్థానాల్లో పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Updated Date - 2022-11-20T14:22:28+05:30 IST