ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MCD election: టిక్కెట్ నిరాకరణతో ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కిన ఆప్ నేత

ABN, First Publish Date - 2022-11-13T14:47:34+05:30

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు అడపాదడపా ఆందోళనకు దిగడం చూస్తుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ ఆదివారంనాడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు అడపాదడపా ఆందోళనకు దిగడం చూస్తుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ ఆదివారంనాడు ఇదే పని చేశారు. ఎంసీడీ ఎన్నికల్లో (MCD elections) తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ ట్రాన్స్‌మిషర్ టవర్ (Transmission ఎక్కి నిరసన తెలియజేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

డిసెంబర్ 4న జరగనున్న ఎంసీడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ, తుది విడత జాబితాలో 117 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ శనివారంనాడు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం తాజా ఘటన చోటుచేసుకుంది. ప్రజా వాణే పార్టీ వాణి అని, సర్వేలో ప్రజలు సూచించిన పార్టీ పాత కర్యకర్తలకే రెండో జాబితాలో చోటు కల్పించినట్టు ఆప్ ప్రకటించింది. టిక్కెట్ల పంపిణీలో పార్టీ కోసం కష్టపడిన 117 మందికి పైగా పాత కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చినట్టు తెలిపింది. టిక్కెట్‌ను ఆశిస్తూ 20,000 మందికి పైగా ఆప్ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సుదీర్ఘ సమావేశం జరిపి అభ్యర్థులను ఖరారు చేసింది.

232 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మరోవైపు, ఢిల్లీ బీజేపీ సైతం ఎంసీడీ ఎన్నికల్లో పోటీ చేసే 232 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 126 మంది మహిళలు, ముగ్గురు ముస్లింలు, ఏడుగురు సిక్కులు, తొమ్మది మంది మాజీ మేయర్లు సైతం ఉన్నారు.

Updated Date - 2022-11-13T15:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising