ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode By Election: రేపు హోరెత్తనున్న మునుగోడు

ABN, First Publish Date - 2022-10-31T21:04:24+05:30

మునుగోడు (Munugode) నియోజకవర్గంలో 15 రోజులుగా హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం(1వ తేదీ) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మునుగోడు (Munugode) నియోజకవర్గంలో 15 రోజులుగా హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం(1వ తేదీ) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సీఎం కేసీఆర్‌ రెండు సార్లు భారీ బహిరంగ సభ నిర్వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah) అతిథిగా బీజేపీ భారీ సభను విజయవంతంగా పూర్తి చేసింది. అధికార టీఆర్‌ఎస్‌ (TRS) నుంచి మండలానికో మంత్రి మకాం వేసి రోడ్‌ షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లతోనే కలిసి దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు నిర్వహించుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 12 రోజులుగా మునుగోడులోనే ఉండగా, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎంపీ అరవింద్‌కుమార్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి రాజగోపాల్‌రెడ్డికి తోడుగా మునుగోడును సుడిగాలిలా చుట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని మకాం వేశారు. ఓవైపు రాహుల్‌ జోడోయాత్ర మరోవైపు మునుగోడులో వరుస రోడ్‌షోలతో ఆయన ప్రచార బాధ్యతలు భుజాన ఎత్తుకున్నారు. సినీనటులు విజయశాంతి, జీవిత, బాబుమోహన్‌ కూడా పాల్గొన్నారు. నేటితో ప్రచారం ముగుస్తుండటంతో పైచేయి సాధించేందుకు ఒకరిని మించి మరొకరు సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-10-31T21:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising