ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కఫాన్ని విరిచే లవంగ టీ

ABN, First Publish Date - 2022-08-02T16:49:23+05:30

అదే పనిగా కురుస్తున్న వానలతో, వాతావరణం చల్లబడి, శ్వాసకోశ సమస్యలు మొదలవుతున్నాయి. అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదే పనిగా కురుస్తున్న వానలతో, వాతావరణం చల్లబడి, శ్వాసకోశ సమస్యలు మొదలవుతున్నాయి. అయితే ఈ సమస్యలకు లవంగ టీతో అడ్డుకట్ట వేయవచ్చు.


నోట్లోని బ్యాక్టీరియాను చంపడంతో పాటు, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి, బయటకు వచ్చేలా చేసే గుణం లవంగాలకు ఉంటుంది. లవంగాలు రోగనిరోధకశక్తిని బలపరుస్తాయి కూడా! దగ్గు, జలుబు, ఛాతీలో ఇబ్బంది లాంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు గృహవైద్యంగా లవంగ టీని తీసుకోవచ్చు. లవంగ టీ ఎలా తయారు చేయాలంటే....


తయారీ ఇలా

అరంగుళం అల్లం ముక్క, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, పావు టీస్పూను లవంగాలను మూడు కప్పుల నీళ్లతో పాటు మరిగించాలి. తర్వాత నీళ్లను వడగట్టి, చల్లారనివ్వాలి. తర్వాత ప్రతి రెండు గంటలకోసారి అరకప్పు లవంగ టీలో అర చెంచా తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి.

Updated Date - 2022-08-02T16:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising