అజీర్తి, గ్యాస్ సమస్యలను ఇలా చెక్‌పెడదాం..
ABN, First Publish Date - 2022-09-02T19:47:12+05:30
ఈ మధ్య కాలంలో చాలా మంది అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్ లాంటి ఆహారపు అలవాట్లు
ఈ మధ్య కాలంలో చాలా మంది అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్ లాంటి ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడటానికి ఇంగ్లిష్ మందులు వాడుతున్నారు. ఈ మందులకు బదులుగా మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
వాముతో చక్కని పరిష్కారం
ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు వాము చక్కని పరిష్కారంగా చెబుతున్నారు. అయితే ఈ వాముని ఏ విధంగా వాడితే జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాము వలన జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. వామును నిమ్మరంతో కలపి తీసుకుంటే హైడ్రోక్లోరిన్ యాసిడ్ పునరుద్ధరించబడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
నార్సింగ్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి)
Updated Date - 2022-09-02T19:47:12+05:30 IST