5 effective herbs : చల్లని వాతావరణంలో జలుబు నుంచి కాపాడే మూలికలు ఇవే..!
ABN, First Publish Date - 2022-11-21T12:46:45+05:30
రోగనిరోధక వ్యవస్థకు సవాలు విసురుతూ జలుబు ఎక్కువగా చికాకు కలిగిస్తుంది.
జలుబు, ఫ్లూ సీజన్ శీతాకాలం చివరి వరకు ఉంటుంది. జలుబు సాధారణంగా మామూలే అయినప్పటికీ, ఇది రోగనిరోధక వ్యవస్థకు సవాలు విసురుతూ ఎక్కువగా చికాకు కలిగిస్తుంది. ఎన్ని మందులు వాడినా అప్పటికి తగ్గినట్టే అనిపిస్తుంది కానీ అది తాత్కాలికం మాత్రమే..మామూలు ఇంగ్లీషు వైద్యంతో విసిగిపోయినవారు అప్పుడప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తూ ఉంటారు. ఇలా అస్తమానూ జలుబు, దగ్గుల బారిన పడేవారు ఈ చికిత్సలో సహాయపడే మూలికా ఔషధాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.
శీతాకాలంలో కలిగే రుగ్మతల నుంచి ఉపశమనం..
1. తులసి
తులసి శీతాకాలపు ఔషదం. ఇది గొప్ప సుగుణాలు కలిగి ఉంది. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఉన్నాయి. దీని వల్ల శీతాకాలంలో కనిపించే వ్యాధులకు తులసి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబునుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటుంది.
2. సపిస్తాన్ ( నక్కెరి పండ్లు)
లాసోరా, లిసోడా, గోండి, నరువిలి, సబెస్తాన్ ప్లం అని భారతదేశమంతటా కనిపించే ఈ చెట్టుకు ఉన్న కొన్ని సాధారణ పేర్లు. చెట్టు వివిధ భాగాలు అంతర్గతంగా, బాహ్యంగా ఔషధ ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. దీనినే సపిస్తాన్, కోర్డియా మిక్సా అని కూడా పిలుస్తారు, సాధారణ జలుబు, దగ్గుతో సహా ఎగువ శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ హెర్బ్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలను కూడా కలిగి ఉంది.
3. అమల్టాస్ (రేల పండ్లు)
రేల చెట్టు ఆయుర్వేదంలో ఔషధ వృక్షంగా ఉపయోగిస్తారు. వీధుల్లో కనిపించే 'గోల్డెన్ షవర్' లేదా లాబర్నమ్ చెట్లు ఈ చెట్టు మూలికను వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కల విత్తనాలు, పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బెరడు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని అమల్టాస్ ఎక్స్‌ట్రాక్ట్స్ జ్వరాన్ని, గొంతులో కలిగే అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది., మంట, ఛాతీలో ఇబ్బందిని తగ్గిస్తుంది. గజ్జి, దురద, అలెర్జీ వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి రేల చెట్టు సహాయపడుతుంది. బీన్స్ లాగా ఉండే ఈ రేల పండ్లను పేస్ట్ గా చేసి గజ్జి, దురద ఉన్న చోట అప్లై చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ రేల చెట్టు మంచి పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోదక శక్తిని పెంచడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
4. ఉన్నాబ్ (రేగి పండ్లు)
ఉన్నబ్, బెర్ అని, కాశీరేగి అని పిలుస్తాం. దీనిని ఎండిన పండుని వైద్యంలో వాడతారు. దీనిని ఇండియన్ జుజుబ్ లేదా కామన్ జుజుబ్ అని కూడా పిలుస్తారు. ఇది దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
5. ములేతి (అశ్వగంధ)
ములేతి లేదా లైకోరైస్ ఇది గొంతు నొప్పిని నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, ఇదే కాదు ఈ మూలికతో ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ యాంటీవైరల్ ఏజెంట్‌లుగా పనిచేసే రెండు రసాయన భాగాలను కలిగి ఉంది. ములేతికి శరీరం లోపల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించకుండా నిరోధించే శక్తి ఉంది.
Updated Date - 2022-11-21T12:52:43+05:30 IST