ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఆవిరి అరుదుగానే...

ABN, First Publish Date - 2022-01-06T17:47:37+05:30

ఆయుర్వేద విధానాలను సాధన చేసే సంప్రదాయం తిరిగి ఊపందుకుంది. శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు, మనసులో పేరుకుపోయిన విషపూరిత భావోద్వేగాలను వదిలించే ప్రాచీన ఆయుర్వేద చికిత్సలకు కొందరు సెలబ్రిటీలు ప్రచారం కల్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-01-2022)

ఆయుర్వేద విధానాలను సాధన చేసే సంప్రదాయం తిరిగి ఊపందుకుంది. శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు, మనసులో పేరుకుపోయిన విషపూరిత భావోద్వేగాలను వదిలించే ప్రాచీన ఆయుర్వేద చికిత్సలకు కొందరు సెలబ్రిటీలు ప్రచారం కల్పిస్తున్నారు. 


హాలీవుడ్‌ సెలబ్రిటీ, వెల్‌నెస్‌ గురు, గ్వినిత్‌ పాల్త్రో, ఆయుర్వేద విధానమైన వెజైనల్‌ స్టీమింగ్‌ను మహిళలకు పరిచయం చేసింది. ఈ రకమైన డిటాక్సిఫైయింగ్‌ విధానాన్ని తామూ అనుసరిస్తున్నట్టు తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ మాజీ భార్య జాడా పింకెట్‌ స్మిత్‌, కూతురు విల్లో స్మిత్‌లు అంగీకరించారు. ఈ తరహా హెర్బల్‌ స్టీమ్‌ వల్ల యోని ఆరోగ్యం మెరుగు పడుతుందని వారి నమ్మకం. ఈ ప్రాచీన విధానం గురించి అర్థం చేసుకోవాలంటే స్త్రీత్వాన్ని వేడుకగా జరుపుకునే ప్రాచీన కాలంలోని అలవాట్లు, నమ్మకాల గురించి తెలుసుకోవాలి. 


ఉపయోగాలున్నాయి 

వెజైనా స్టీమింగ్‌తో కండరాలు స్వాంతన పొంది, రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం తేమను పొంది, శుభ్రపడుతుంది. ఇందుకోసం ఫ్రాంకిన్‌సెన్స్‌, మిర్‌, వేప ఆకులను మరిగించి, ఆ నీటితో ఆవిరి పట్టవలసి ఉంటుంది. ఈ ఆవిరితో వ్యాధికారక క్రిములు నశించి, మంచి బ్యాక్టీరియా పెరిగే వాతావరణం ఏర్పడుతుంది. ఒకర్నొకరు తాకి, వారి భిన్నమైన శరీరాకృతుల పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, నగ్నత్వం పవిత్రతను అర్థం చేసుకోవడం కోసం ఈ రకమైన యోని వేడుకను ప్రాచీన మహిళలు సామూహికంగా జరుపుకునేవారు. 


పరిమితి మేరకే 

యోని, తనంతట తాను శుభ్రం చేసుకోగలిగే అవయం. డూషింగ్‌, వెజైనల్‌ వాషింగ్‌ ద్వారా అవసరానికి మించి శుభ్రం చేసుకోవలసిన అవసరం లేదు. అయినప్పటికీ వెజైనా స్టీమింగ్‌ను సాధన చేయాలనుకునే మహిళలకు స్త్రీవైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పది నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు. లేదంటే యోనిలోని సున్నితమైన కణజాలం దెబ్బతింటుంది.


20 నుంచి 25 నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల యోని పిహెచ్‌ బ్యాలన్స్‌ అదుపుతప్పి ఆమ్లత్వం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా తేలికగా ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఆవిరికి ఉపయోగించే పరికరాలు శుభ్రంగా లేకపోయినా ఇన్‌ఫెక్షన్లు తప్పవు. గర్భిణులు ఈ విధానాన్ని సాధన చేస్తే, కడుపులో పెరిగే బిడ్డ మీద దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి ఒక సిటింగ్‌కు రెండు నుంచి మూడు సార్లు, వారం మొత్తంలో మూడు సార్లకు మించి ఇలా ఆవిరి పట్టకూడదు. ఆవిరి పట్టిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.

Updated Date - 2022-01-06T17:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising