ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 ways to use mulethi: అతిమధురంతో దగ్గు, జలుబు దూరమవుతుందా..?

ABN, First Publish Date - 2022-11-02T11:45:31+05:30

ఆయుర్వేదంలో అతిమధురానికి మొదటి స్థానం ఉంది.

mulethi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు దగ్గు, జలుబు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పర్యావరణ తేమ కారణంగా ప్రతి వయస్సు వారు ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆయుర్వేదంలో అతిమధురానికి మొదటి స్థానం ఉంది. ఈ వేరు సహాయంతో ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

దీనిని హిందీలో ములేతీ అంటారు. ఈ మొక్కలో గ్లయిసిరైజిక్‌ యాసిడ్, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, యాస్పిరాజిన్, ఈస్ట్రోజెన్‌, స్టిరాయిడ్‌, సుగంధిత తైలం వంటివి ఉన్నాయి. అనారోగ్యానికి సమర్ధవంతంగా చికిత్స చేయగల అనేక మందులు ఉన్నప్పటికీ, గొంతు నొప్పితో పాటు దగ్గు, జలుబును నయం చేయడానికి మాత్రమే కాకుండా దీర్ఘకాల ప్రభావాన్ని కలిగి ఉండటానికి అతిమధురం చక్కని పరిక్షారంగా ఉపయోగపడుతుంది.

అతిమధురాన్ని ఎందుకు ఉపయోగించాలి?

గొంతు నొప్పికి అతి మధురం అత్యంత ప్రభావవంతమైన చికిత్స. దీనిని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఇది గొంతు నొప్పికి పురాతన ఔషధం, ఎక్స్‌పెక్టరెంట్, బ్రోంకోడైలేటర్ లక్షణాలను కలిగి ఉంటుంది.

అతిమధురం ఉపయోగించే వివిధ మార్గాలు:

అతిమధురం నీరు

దగ్గు, జలుబు రాకుండా చేసే గుణం అతిమధురానికి ఉంది. ఇది మీ శరీరాన్ని ఫ్లూ నుండి కాపాడడమే కాకుండా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ అతిమధురం పొడిని కలిపి రోజూ సేవిస్తే చలికాలంలో గొంతు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

అతిమధురంతో టీ

గొంతు నొప్పికి అతిమధురం టీ తాగడం వల్ల చక్కని ఉపశమనంగా పనిచేస్తుంది. ఒక కప్పు వేడినీటిలో ఒక చిన్న ముక్క అతిమధురం వేరు వేయండి. ఈ మరిగే మిక్స్‌లో తురిమిన అల్లం వేసి మరిగించి, వడకట్టి, టీ బ్యాగ్ వేసి తీసుకోవాలి.

అతిమధురం వేర్లను నమలడం

అతిమధురం దగ్గు, జలుబు, గొంతు, గొంతు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అతిమధురం వేర్లు నమలడం వల్ల దగ్గు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. గొంతు క్లియర్ అవుతుంది.

మరో ప్రయోజనం..

నాల్గవ వంతు అతిమధురం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఎండుమిరియాల పొడి కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. మంచి ఫలితాల కోసం ఒక చెంచా తేనె వేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Updated Date - 2022-11-02T11:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising