ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాయామం నియమంగా...

ABN, First Publish Date - 2022-08-02T18:06:00+05:30

శరీర దారుఢ్యం పెంచుకోవడం కోసం కొన్ని నియమాలు పాటించక తప్పదు. ఆరోగ్యంతో పాటు, అందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీర దారుఢ్యం పెంచుకోవడం కోసం కొన్ని నియమాలు పాటించక తప్పదు. ఆరోగ్యంతో పాటు, అందం, ఆనందం దక్కాలంటే నియమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి, కొన్ని జీవనసూత్రాలను ఆచరించాలి. 


  • ఎంత పని ఒత్తిడి ఉన్నా వ్యాయామాన్ని అలక్ష్యం చేయకూడదు. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిని అనుసరిస్తూ ఉన్నా, జిమ్‌కు వెళ్లి వ్యాయామాల చేయలేకపోతున్నామే అని చింతిస్తూ కూర్చోవద్దు. వ్యాయామాల కోసం జిమ్‌కే వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో నేల మీద కూడా వ్యాయామాలు చేయవచ్చు. ఇందుకోసం, పిరుదులు, కాళ్లు, పొత్తికడుపు, తొడలు, ఛాతీ, చేతులను దృఢపరిచే ఫ్లోర్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయవచ్చు. ఇందుకోసం పుషప్స్‌, లంజెస్‌, స్వ్కాట్స్‌ చేయవచ్చు. ఈ వ్యాయామాలకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఒక్కో వ్యాయామంలో 10 నుంచి 12 రెప్స్‌ ఉండేలా, కనీసం 3 సెట్లు చేయగలిగితే మంచి ఫలితం దక్కుతుంది.
  • బలవంతంగా, అయిష్టంగా చేసే ఏ పని వల్లా ఫలితం దక్కదు. కాబట్టి వ్యాయామాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించాలి. అలాంటప్పుడే వ్యాయామాల్లో పొరపాట్లు జరగకుండా ఉంటాయి. బరువులు ఎత్తడం ఇష్టం లేకపోతే, శరీర భంగిమలో పొరపాట్లు జరిగి కండరాల నొప్పులు మొదలవ్వచ్చు. పొత్తికడుపు వ్యాయామాలు చేసే సమయంలో సరైన పద్ధతి పాటించకపోతే మెడ నొప్పి వేధించవచ్చు. అలాగే శ్వాస మీద ఏకాగ్రత లేకపోయినా, వ్యాయామాల్లో పొరపాట్లు దొర్లుతాయి. దాంతో వ్యాయామం ఇబ్బందికరంగా మారి, ఆసక్తి మరింత తగ్గుతుంది. కాబట్టి వ్యాయామాన్ని ఇష్టంగా కొనసాగించాలి. 
  • కొందరు ఉదయం వేళ హుషారుగా ఉంటారు. మరికొందరు సాయంత్రం చలాకీగా ఉంటారు. ఉదయం చలాకీగా, శక్తివంతంగా ఉంటే, వ్యాయామానికి ఆ సమయాన్నే కేటాయించాలి. సాయంత్రం శక్తిగా ఉండేవారు ఆ సమయంలోనే వ్యాయామాలు చేయడం ఉత్తమం. అందుకు తగ్గట్టు దైనందిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పరచుకోవాలి. పని ఒత్తిడికి తగ్గట్టు కాకుండా, శరీర తీరును బట్టి వ్యాయామ వేళలు నిర్ణయించుకుంటే, సమర్ధంగా వ్యాయామాలు చేయగలుగుతారు, ఫలితాన్నీ సాధించగలుగుతారు. 

Updated Date - 2022-08-02T18:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising