స్క్వాట్స్‌తో చక్కని రూపం
ABN, First Publish Date - 2022-09-06T15:26:01+05:30
కొందరికి నడుము కింది భాగంలో పిరుదుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించాలంటే
కొందరికి నడుము కింది భాగంలో పిరుదుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించాలంటే ‘స్క్వాట్స్’ వ్యాయామం చేయాల్సిందే! మొదట్లో కష్టమనిపించినా చేయటం అలవాటు చేసుకుంటే ఈ వ్యాయామం తేలికగానే అనిపిస్తుంది. స్క్వాట్స్ ఎలా చేయాలంటే...
- నిటారుగా నిలబడి మోకాళ్లను వంచి కిందకి కుంగాలి. ఇలా కుంగినప్పుడు నడుం పైభాగాన్ని ముందుకు వంచి, చేతులు రెండూ మడిచి, వేళ్లను కలపాలి.
- కుంగి లేచేటప్పుడు మోకాళ్లు, పాదాలు సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి.
- కుర్చీ మీద కూర్చున్నంత ఎత్తు మేరకే కుంగాలి.
- లేచి నిలబడ్డప్పుడు పిరుదులను, తొడలను బిగించాలి.
- వంగినప్పుడు ఊపిరి పీల్చుకుని, లేచి నిలబడ్డప్పుడు వదలాలి.
- ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 స్క్వాట్స్ చేస్తే పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
Updated Date - 2022-09-06T15:26:01+05:30 IST