వ్యాయామం ఇలా చేస్తే..!
ABN, First Publish Date - 2022-10-11T18:32:22+05:30
గాయాల నుంచి తప్పించుకోవడం కోసం వ్యాయామానికి ముందు స్ట్రెచింగ్ చేయాలి.
అపోహ: గాయాల నుంచి తప్పించుకోవడం కోసం వ్యాయామానికి ముందు స్ట్రెచింగ్ చేయాలి.
వాస్తవం: వ్యాయామానికి ముందు చేసే స్ట్రెచింగ్ వల్ల కండరాలు అస్థిరంగా మారతాయి. బదులుగా గుండె వేగం పెరిగి, రక్త ప్రవాహ వేగం పెరగడానికి వార్మప్ యాక్టివిటీస్ చేయాలి.
అపోహ: కార్డియో వ్యాయామాలతో బరువు తగ్గవచ్చు
వాస్తవం: కార్డియో వ్యాయామాలతో క్యాలరీలు ఖర్చయినప్పటికీ, బరువు తగ్గడం కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరిగా చేయాలి. ఈ వ్యాయామాలతో కండరాలు దృఢపడతాయి కాబట్టి, విశ్రాంతి సమయంలో సైతం క్యాలరీలు ఖర్చవుతూ ఉంటాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గగలుగుతాం.
అపోహ: ఉదయం వేళ వ్యాయామాలు చేయడమే ఉత్తమం
వాస్తవం: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఏ సమయంలో వ్యాయామం చేసినా ఒకే ఫలితం దక్కుతుంది. కాబట్టి అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని, క్రమం తప్పక వ్యాయామం చేయాలి.
అపోహ: వేడి నీటి స్నానంతో కండరాల నొప్పులు తగ్గుతాయి
వాస్తవం: చల్లని తాపమానాలతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో నొప్పులకు కారణమయ్యే లాక్టిక్ యాసిడ్ ఒకే ప్రదేశంలో నిల్వ ఉండిపోదు. కాబట్టి ఒళ్లు నొప్పులు తగ్గడం కోసం వేడి నీటికి బదులుగా చల్లనీళ్లతో స్నానం చేయాలి.
Updated Date - 2022-10-11T18:32:22+05:30 IST