ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగిసడలిన అందాలకు అద్భుతమైన వ్యాయామాలు

ABN, First Publish Date - 2022-03-20T02:57:55+05:30

అందానికి మగువలు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వివాహం జరిగి పిల్లలు పుట్టాక వారిలోని బిగువు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందానికి మగువలు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వివాహం జరిగి పిల్లలు పుట్టాక వారిలోని బిగువు కొంత సడలుతుంది. దీంతో వారిలో ఆందోళన మొదలవుతుంది. వక్షోజాలు వదలు కావడాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. అయితే, ఇందుకు బోల్డన్ని కారణాలు కూడా ఉండొచ్చు. అంటే జీవనశైలి, జెనెటిక్స్, ఆరోగ్యంపైనా ఇది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వారికి 20 ఏళ్ల వయసులోనే వక్షోజాల బిగుత సడలిపోయి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ మాత్రానికే కుంగిపోవాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న వ్యాయామాల ద్వారా వదులైన వక్షోజాలను బిగుతుగా చేసుకోవచ్చు. పూర్వ స్థితికి తీసుకురావొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


వైడ్ టు క్లోజ్ పుషప్

ఈ వ్యాయామం కోసం తొలుత పుషప్ పొజిషన్ తీసుకోవాలి. చేతులు సరిగ్గా మీ భుజాల కింద కాస్త ఎడంగా ఉండాలి. ఆ తర్వాత వ్యాయామం ప్రారంభించాలి. ఈ  క్రమంలో వక్షోజాలు నేలకు తగిలేలా పుషప్స్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ పైకి లేవాలి. ఇలా కిందికిపైకి 15 రెప్స్‌తో 3 సెట్లు పూర్తిచేయాలి.  


డంబెల్ బెంచ్ ప్రెస్ 

ఈ వ్యాయామంలో వెనక ఓ ఏటవాలు బెంచ్ లాంటిది ఉండాలి. దానికి ఆనుకుని రెండు చేతుల్లో రెండు డంబెల్స్ పట్టుకోవాలి. అరచేతులు పాదాలకు ఎదురుగా ఉండాలి. ఇప్పుడు కాళ్లను గాల్లోంచి నేలపైకి నెమ్మదిగా తీసుకొచ్చి ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు డంబెల్స్ ఉన్న చేతలను చాతీపైకి నిలువుగా తీసుకురావాలి. ఈ క్రమంలో డంబెల్స్ రెండు ఒకదాన్ని ఒకటి నెమ్మదిగా తాకాలి. అంటే చేతులు ‘వి’ ఆకారంలో కదలాలన్నమాట. ఆ తర్వాత చేతులను నెమ్మదిగా కిందికి దించాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టాలి. ఆ తర్వాత మళ్లీ మునుపటిలా చేయాలి. ఇలా 15 రెప్స్‌తో 3 సెట్లు చేయాలి.


ఇంక్లైన్ డంబెల్ ఫ్లై

డంబెల్ బెంచ్ ప్రెస్‌లానే దీనిని కూడా ఏటవాలు బెంచ్ పైనే చేయాలి. రెండు చేతుల్లో రెండు డంబెల్స్ పట్టుకుని చేతులను నిటారుగా లేపాలి. ఇప్పుడు చేతులను అలాగే వెనక్కి వంచాలి. అంటే సమాంతరంగా తీసుకురావాలి. ఇప్పుడు ఒక క్షణం ఆగి శ్వాసను వదులుతూ  చేతులను మళ్లీ యథాస్థానంలోకి తెచ్చుకోవాలి. దీనిని కూడా మూడుసెట్లుగా చేయాలి. 


కేబుల్ క్రాసోవర్

ఇందులో మిషన్ పుల్లీ హ్యాండిళ్లను కిందకు లాగాల్సి ఉంటుంది. ఇందుకోసం మొదట మిషన్ రెండు వైపులా పుల్లీలను హై లెవల్‌కు సెట్ చేసుకోవాలి. అలాగే, బరువును సర్దుబాటు చేసుకోవాలి. తొలుత తేలికైన బరువుతో ప్రారంభించి ఆ తర్వాత సౌకర్యంగా అనిపిస్తే బరువును పెంచుకుంటూ పోవచ్చు. మిషన్ మధ్యలో నిలబడి పాదాలను భుజం వెడల్పులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కుడి కాలిని ఒక అడుగు ముందుకు వేసి పుల్లీలను లాగాలి. ఈ క్రమంలో నడుమును కూడా కొంచెం వంచి చాతీ కండరాలు సాగినట్టు అనిపించే వరకు చేతులను చాచాలి. ఊపిరి పీల్చుకుని తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా 15 రెప్స్ చేయాలి.


కోబ్రా పోజ్

ఈ వ్యాయామంలో పొట్టను నేలకు ఆనించి పడుకోవాలి. ఆ తర్వాత అరచేతులను నేలకు ఆన్చాలి. ఆపై నేలను నెడుతూ తలను నెమ్మదిగా పైకి లేపాలి. అలా నడుమును కదపకుండా చాతీభాగం వరకు లేపాలి. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకోవడం మర్చిపోకూడదు. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చే వరకు మూడు సెకన్ల పాటు అలాగే ఉండాలి. ఇవి కూడా మూడు సెట్స్ చేయాలి. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా వక్షోజాలను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-03-20T02:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising