ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్ట చదునుగా ఉండాలంటే!

ABN, First Publish Date - 2022-08-29T17:51:27+05:30

పొట్ట దగ్గర పేరుకునే కొవ్వు కరిగించడానికి ఆహార నియమాలు పాటించడంతోపాటు, వ్యాయామాలూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొట్ట దగ్గర పేరుకునే కొవ్వు కరిగించడానికి ఆహార నియమాలు పాటించడంతోపాటు, వ్యాయామాలూ చేయక తప్పదు. అవేంటంటే....


అల్పాహారం: ఉదయం అల్పాహారం మానేస్తే కొవ్వు కరుగుందనుకోవడం అపోహ. అల్పాహారంతో రోజును చలాకీగా మొదలు పెట్టడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. దాంతో హషారుగా పనులు చేసుకోగలుగుతాం. ఫలితంగా పొట్ట భాగంలోని కొవ్వు మీద ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే అల్పాహారం మానేస్తామో, ఆకలి మరింత పెరిగి, మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయులను అమాంతంగా పెంచుకోవడం కోసం మనసు తీపి పదార్థాల వైపు లాగుతుంది. ఫలితంగా వ్యతిరేక ఫలం దక్కుతుంది.

తక్కువ క్యాలరీలు: వీలైనంత తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం వేపుళ్లు మానేసి, ఆవిరి మీద ఉడికించిన ఆహారం తీసుకోవాలి. నూనెలు, పిండిపదార్థాలు తగ్గించి, పీచు, మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం ఎంచుకోవాలి.

నీరు ముఖ్యం: శరీర జీవక్రియలు చురుగ్గా జరిగి ఒంట్లోని విషాలు విసర్జింపబడాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో పేరుకునే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోయినా కొవ్వు కరగదు.

నిద్ర అవసరం: నిద్రలో శరీరం సాంత్వన పొందుతుంది. మరుసటి రోజుకు సిద్ధపడుతుంది. నిద్ర లోపిస్తే మెటబాలిజం తగ్గి శక్తి ఖర్చయ్యే వేగం తగ్గుతుంది. ఫలితంగా కొవ్వు కరగకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. 

Updated Date - 2022-08-29T17:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising