ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యాన్ని కుదేలు చేసే భావోద్వేగాలు

ABN, First Publish Date - 2022-05-17T17:36:37+05:30

తన కోపం తనకు శత్రువు అంటూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. కోపంతో పాటు చికాకు, సంతోషం, ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-05-2022)

తన కోపం తనకు శత్రువు అంటూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. కోపంతో పాటు చికాకు, సంతోషం, ఆందోళన మొదలైన భావోద్వేగాలు శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటి ప్రభావాల పట్ల అవగాహన పెంచుకోవడం అవసరం.


నవ్వు: నవ్వుతో రోగనిరోధకశక్తికి తోడ్పడే కణాలు పెరగడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే యాంటీబాడీలు కూడా వృద్ధి చెందుతాయి. కాబట్టే సంతోషం సగం బలం అన్నారు. నవ్వుతో రక్తనాళాల పనితీరు మెరుగై, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది.


కోపం: కోపోద్రిక్తులైన రెండు గంటల తర్వాత గుండెపోటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే కన్‌స్ట్రక్టివ్‌ యాంగర్‌... అంటే, అకారణంగా కోపం తెచ్చుకోవడం కాకుండా, కోపం తెప్పించే సందర్భాల వల్ల కోపోద్రిక్తులవడం వల్ల గుండె మీద పడే ప్రభావం తక్కువగా ఉండే వీలుంది. అలాగే కోపం తెచ్చుకున్న ఆరు గంటల లోపు శరీరంలో యాంటీబాడీల పరిమాణం తగ్గి వ్యాధినిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది. అలాగని కోపాన్ని అదుపు చేసుకున్నా, ఆయుష్షు తగ్గుతుంది. కాబట్టి కోపాన్ని అవసరం మేరకు వ్యక్తపరచాలి. 


భావోద్వేగాలు చెప్పుచేతల్లో: నిస్సహాయత, నిరాశ లాంటి భావోద్వేగాలు శరీరంలో హార్మోన్ల అసమతౌల్యానికి కారణమవుతాయి. సంతోషం, ఇమ్యూన్‌ రెస్పాన్స్‌కు కారణమయ్యే మెదడులోని రసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. కాబట్టి అలాంటి భావోద్వేగాలకు మూల కారణాలను వెతికి, వాటిని సరిదిద్దుకోవాలి.


ఒత్తిడి: తీవ్ర ఒత్తిడితో డిఎన్‌ఎలో ఉండే టీలోమీయర్స్‌ పొడవు తగ్గుతుంది. ఫలితంగా ఆయుష్షు తగ్గుతుంది.


భయం: భయం... ఫైట్‌ అండ్‌ ఫ్లయిట్‌ స్పందన కోసం ఉద్దేశించినది. అయితే ఇదే భావోద్వేగం నిరంతరంగా కొనసాగితే, కార్డియో వాస్క్యులర్‌ సిస్టమ్‌ దెబ్బతినడంతో పాటు, ఆకలి మందగించి, అజీర్తి మొదలవుతుంది. కాబట్టి అర్థం లేని భయాలను, అనుమానాలను వదిలించుకోవాలి. 


Updated Date - 2022-05-17T17:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising