నెలసరి నలత నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2022-03-15T17:08:10+05:30
నెలసరి కొనసాగినన్ని రోజులూ నడుము నొప్పి, పొత్తి కడుపు బిగదీయడం, కాళ్లు లాగడం లాంటి
ఆంధ్రజ్యోతి(15-3-2022)
నెలసరి కొనసాగినన్ని రోజులూ నడుము నొప్పి, పొత్తి కడుపు బిగదీయడం, కాళ్లు లాగడం లాంటి ఇబ్బందులు సహజం. అయితే ఈ అసౌకర్యాన్ని యోగాసనాలతో తగ్గించుకోవచ్చు. ఆ ఆసనాలు ఏవంటే...
బద్ధకోణాసనం
పద్మాసనంలో కూర్చుని రెండు పాదాలను ఆనించాలి. రెండు చేతులతో పాదాలను కలిపి పట్టుకుని, నిటారుగా కూర్చోవాలి. తర్వాత ఊపిరి పీల్చి వదులుతూ, కాళ్లను పైకి కిందకూ కదిలించాలి. ఇలా 30 సెకన్ల పాటు చేయాలి.
బాలాసనం
మోకాళ్ల మీద కూర్చుని, ముందుకు వంగి, తలను నేలకు ఆనించాలి. చేతులను తల మీదుగా చాపి, అర చేతులను నేల మీద ఆనించాలి. ఈగాలి పీల్చి, వదులుతూ, ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి.
సేతుబంధాసనం
వెల్లకిలా పడుకుని, కాళ్లను మడవాలి. చేతులతో నడుమును పట్టుకోవాలి. చేతులు, కాళ్ల మీద బరువు మోపుతూ, నెమ్మదిగా నడుమును పైకి లేపి, బ్రిడ్జి ఆకారంలోకి శారీరాన్ని మార్చాలి. ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి.
Updated Date - 2022-03-15T17:08:10+05:30 IST