సమస్యకు తగిన సాధనతో.. ఆరోగ్య ప్రయోజనాలు!
ABN, First Publish Date - 2022-04-07T19:02:44+05:30
యోగాసనాలతో భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది. కాబట్టి సమస్యకు తగిన ఆసనాన్ని ఎంచుకుని, సాధన చేయాలి.
ఆంధ్రజ్యోతి(07-04-2022)
యోగాసనాలతో భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది. కాబట్టి సమస్యకు తగిన ఆసనాన్ని ఎంచుకుని, సాధన చేయాలి.
సేతు బంధ సర్వాంగాసనం: ఈ బ్రిడ్జి పోజ్‌తో జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. మానసిక కుంగుబాటు, ఒత్తిడి తగ్గుతాయి.
ఉస్త్రాసనం: ఈ క్యామెల్ పోజ్ ప్రసవానంతర అధిక బరువును తగ్గించుకోవచ్చు. మరీ ముఖ్యంగా పొట్ట, నడుము దగ్గరి కొవ్వు ఈ ఆసనంతో కరుగుతుంది. అలాగే వదులైన కండరాలు కూడా బలపడతాయి.
త్రికోణాసనం: ఈ ట్రయాంగిల్ పోజ్ శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. మెడనొప్పి తగ్గడంతో పాటు, శరీరం మొత్తం రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది.
ఏకపాద కౌండియాసనం: ఈ సిజర్స్ పోజ్ కొంత క్లిష్టం. కాబట్టి అనుభవజ్ఞుల సమక్షంలోనే ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడమే కీలకం. దీంతో శరీరం పటుత్వం పొందుతుంది.
Updated Date - 2022-04-07T19:02:44+05:30 IST