ఈ ఆసనం చేస్తే..
ABN, First Publish Date - 2022-08-10T20:21:20+05:30
రెండు కాళ్లును ముందుకి చాచి నిటారుగా కూర్చోవాలి. తర్వాత కుడికాలిని మడచి, కుడి మడమని పట్టుకోవాలి
రెండు కాళ్లును ముందుకి చాచి నిటారుగా కూర్చోవాలి. తర్వాత కుడికాలిని మడచి, కుడి మడమని పట్టుకోవాలి. శ్వాస వదులుతూ కుడికాలని నిటారుగా చేసి నుదురుని మోకాలపై ఆనించాలి. ఆసనంలో సాధారణ శ్వాసతో 30 సెకన్లపాటు ఉండిపోవాలి.
ప్రయోజనాలు
- పొట్టకు రక్తం సరఫరా పెంచి జీర్ణక్రియను మెరుగుపరుచును.
- ఒబెసిటీని దూరం చేయును.
- రోగనిరోధకశక్తిని పెంచును.
- కాళ్ళకి మంచిగా రక్తం సరఫరా జరుగుతుంది.
జాగ్రత్తలు
- మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
- సుహాసినిరెడ్డి , యోగా థెరపిస్ట్,
(9908960371)
(నార్సింగ్- ఆంధ్రజ్యోతి)
Updated Date - 2022-08-10T20:21:20+05:30 IST