ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, 20 మంది మృతి, 300 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-11-21T15:01:43+05:30

ఇండోనేసియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జకార్తా: ఇండోనేషియా(Indonesia)లోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భారీ భూకంపం (Earthquake) సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో డజన్ల కొద్ది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో తీవ్రంగా భూప్రకంపనలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజధానిలోని ఆకాశహర్మ్యాలు సుమారు మూడు నిమిషాల పాటు ఊగిపోయినట్టు చెబుతున్నారు. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కూలిన భవంతుల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2022-11-21T15:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising