Shocking: నర్సు దారుణం.. 8600 మందిని ప్రమాదంలోకి నెట్టిన వైనం.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN, First Publish Date - 2022-12-02T20:28:29+05:30
కరోనా టీకాల వెనుక కార్పొరేట్ సంస్థల కుట్రదాగుందని నమ్మిన ఓ నర్సు తన వృత్తి ధర్మాన్నే మర్చిపోయింది. టీకా వెయించుకునేందుకు తనను నమ్మి వచ్చిన 9 వేల మంది వృద్ధులను ప్రమాదంలోకి నెట్టింది.
ఎన్నారై డెస్క్: కరోనా టీకాల వెనుక కార్పొరేట్ సంస్థల కుట్రదాగుందని నమ్మిన ఓ నర్సు(Anti-vaxxer nurse) తన వృత్తి ధర్మాన్నే మర్చిపోయింది. టీకా వెయించుకునేందుకు తనను నమ్మి వచ్చిన 9 వేల మంది వృద్ధులకు టోపీ పెట్టింది. టీకా బదులు సాలైన్ ఇవ్వడంతో వారందరికీ టీకా రక్షణ లేక ప్రమాదంలో పడ్డారు. అయితే.. టీకాకరణ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు అనడానికి తిగిన సాక్ష్యాధారులు లేకపోవడంతో ఆమె జైలు శిక్షను తప్పించుకుంది. కానీ.. వృత్తిపరమైన నియమనింబంధనలు ఉల్లంఘించినందుకు ఆమె తన నర్సు లైసెన్సు పోగొట్టుకుంది. జర్మనీలో(Germany) జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
నిందితురాలు యాంట్జే ఫ్రీస్‌ల్యాండ్‌లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో కరోనా టీకాలు ఇచ్చేది. 2021 మార్చి 5 నుంచి ఏప్రిల్ మధ్య ఏకంగా 8600 మందికి కరోనా టీకాలు ఇచ్చింది. కానీ.. అవన్నీ ఉత్త సాలైన్ అని ఆ తరువాత బయటపడింది. ఓ రోజు యాంట్జే పక్కనే ఉన్న మరో నర్సు.. ఆమె టీకాకు బదులు సాలైన్ ఇస్తున్న వైనాన్ని గుర్తించి ఫిర్యాదు చేసింది. దీంతో..పోలీసులు ఆమెను ప్రశ్నించడంతో కేవలం ఆరుగురికి మాత్రమే సాలైన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. పొరపాటున టీకా వయల్ తన చేయిజారి పగిలిపోవడంతో తప్పు బయటపడకుండా ఉండేందుకు ఇలా చేశానని పేర్కొంది. అయితే..టీకాను నమ్మద్దంటూ(Vaccine Conspiracies) అప్పటికే ఆమె సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు పోస్ట్ చేసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు..ఆమె వద్ద టీకా తీసుకున్న వారందరినీ పరీక్షిస్తే వారిలో కరోనా నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి కాలేదని తేలింది.
అయితే..టీకాపై వ్యతిరేకతతోనే ఆమె ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాసిక్యూషన్‌కు స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకుంది. ఇక యాంట్జే చేసిన పని బయటపడగానే అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా.. ఆమె లైసెన్స్ కూడా రద్దు చేశారు. తాను చేసిన పనికి యాంట్జే కోర్టులో క్షమాపణలు చెప్పింది. కాగా.. అప్పట్లో టీకా తీసుకున్న వారందరినీ మరోసారి వ్యాక్సిన్ కోసం రావాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-12-02T20:28:29+05:30 IST