ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Effect: చైనాలో ఊహించని పరిణామం..

ABN, First Publish Date - 2022-12-27T23:37:49+05:30

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఫైజర్ టీకా పంపిణీకి పూనుకుంది. త్వరలో అక్కడి ఆరోగ్య కేంద్రాల్లో ఫైజర్ టీకా పంపిణీకి సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఊహించని విధంగా ఫైజర్ టీకా పంపిణీకి పూనుకుంది. త్వరలో అక్కడి ఆరోగ్య కేంద్రాల్లో ఫైజర్ టీకా పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడ్డాయి. చైనా రూపొందించిన కరోనా టీకాలు విఫలం కావడంతోనే అక్కడ కరోనా విజృంభిస్తోందన్న అనుమానాల నేపథ్యంలో చైనా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. తొలుత స్థానిక వైద్య సిబ్బందికి ఈ టీకా వినియోగంలో పూర్తిస్థాయి ట్రెయినింగ్ ఇచ్చిన అనంతరం.. టీకాకరణ చేపడతారు. చైనా ప్రభుత్వ అనుమతి పొందిన ఒకే ఒక్క విదేశీ కరోనా టీకా ఫైజర్‌ది కావడం గమనార్హం. చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజుకు ఒక మిలియన్ కేసులకు పైగా నమోదవుతున్నాయి. అయితే.. కేసులకు సంబంధించి ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో చైనాలో ఏం జరుగుతోందన్న దానిపై పూర్తి స్థాయి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో చైనా..ఫైజర్ టీకావైపు మళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-12-27T23:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising