ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: చైనా కీలక నిర్ణయం..

ABN, First Publish Date - 2022-11-10T21:59:57+05:30

ఇటివలే ఎన్నికైన చైనా (China) కొత్త నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్వాంగ్జౌ (Guangzhou) నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. చైనా ‘డైనమిక్-జీరో కొవిడ్-19 పాలసీ’ని యథావిథిగా కొనసాగించాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ఇటివలే ఎన్నికైన చైనా (China) కొత్త నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్వాంగ్జౌ (Guangzhou) నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. చైనా ‘డైనమిక్-జీరో కొవిడ్-19 పాలసీ’ని యథావిథిగా కొనసాగించాలని నిర్ణయించింది. అంటువ్యాధుల నిరోధక చర్యల్లో ఎలాంటి సడలింపులకు తావివ్వకూడదని పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ (Politburo Standing Committee) నిర్ణయం తీసుకుంది. గ్వాంగ్జౌ నగరంలో కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు నగర లాక్‌డౌన్‌‌ను అకస్మాత్తుగా రద్దు చేశారు. అయితే వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగించాలని నగరవాసులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని చైనా అధికార మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా గత నెలలో చైనాకు మరో దఫా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ ( Xi Jinping) ఎన్నికయ్యాక జరిగిన తొలి ఇదేనని అక్కడి మీడియా వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఏమాత్రం పడకూడదని, అందుకోసం పకడ్బంధీగా వ్యవహరించాలని జిన్‌పింగ్ సందేశమిచ్చారు. కరోనా కట్టడికి మరిన్ని తీర్మాణాలు చేసి వాటిని అమలు చేయాల్సివుందని చెప్పారు. దేశ ఉత్పత్తి, సాధారణ జీవనం వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2022-11-10T22:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising