ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిష్కృత పాక్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్ కాల్చివేత

ABN, First Publish Date - 2022-10-24T16:00:05+05:30

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రముఖ న్యూస్ యాంకర్లలో ఒకరైన అర్షద్ షరీఫ్ కెన్యాలో కాల్చివేతకు గురయ్యారు. ఆ విషయాన్ని షరీఫ్ భార్య ధ్రువీకరించారు. కొద్ది నెలల క్రితం షరీఫ్‌పై దేశద్రోహ ఆరోపణలు మోపడంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ నుంచి పారిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) ప్రముఖ న్యూస్ యాంకర్లలో ఒకరైన అర్షద్ షరీఫ్ (Arshad Sharif) కెన్యా (Kenya)లో కాల్చివేతకు (Shot dead) గురయ్యారు. ఆ విషయాన్ని షరీఫ్ భార్య ధ్రువీకరించారు. కొద్ది నెలల క్రితం షరీఫ్‌పై దేశద్రోహ ఆరోపణలు మోపడంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ నుంచి పారిపోయారు.

పాకిస్థాన్ మిలటరీ విమర్శకులలో ఒకరిగా, గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి కోల్పోయిన మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుగా షరీఫ్‌‌కు పేరుంది. ''నా మిత్రుడిని, భర్తను, ఇష్టమైన జర్నలిస్టును ఈరోజు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం ఆయన కెన్యాలో కాల్చివేతకు గురయ్యారు'' అని షరీఫ్ భార్య జవెరియా సిద్ధిఖి ట్వీట్ చేశారు.

కాగా, గత ఏడాది ఆగస్టులో సీనియర్ ప్రతిపక్ష నేత షబాజ్ గిల్‌ను షరీప్ ఇంటర్వ్యూ చేశారు. మెజారిటీ అభిప్రాయాలకు భిన్నంగా సాయుధ బలగాల్లోని జూనియర్ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని, ఉత్తర్వులను పెడచెవిని పెడుతున్నారని షబాజ్ గిల్ వ్యాఖ్యానించారు. గిల్ వ్యాఖ్యలు న్యూస్ ఛానెల్స్‌లో ప్రసారం చేయగానే షరీఫ్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది. దాంతో ఆయన దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. కెన్యాలో ఆర్షద్ షరీఫ్ కాల్చివేతకు గురయ్యారని, పోలీసులు విచారణ జరుపుతున్నారని ఏఆర్‌వై న్యూస్ ఛానెల్ ఒక ట్వీట్‌లో తెలిపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా షరీఫ్ మృతిని ధ్రువీకరించింది. షరీఫ్ మృతి చెందిన వార్త బయటకు రాగానే సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-10-24T16:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising