ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taliban Diktat: మహిళలపై తాలిబన్లు మరిన్ని ఆంక్షలు

ABN, First Publish Date - 2022-11-10T19:52:23+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్న తాలిబన్లు (Talibans)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్న తాలిబన్లు (Talibans) ఇప్పుడు వారిపై మరికొన్ని ఆంక్షలు విధించారు. కాబూల్‌లో వారు అమ్యూజ్‌మెంట్ పార్కుల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పబ్లిక్ పార్కుల్లోకి వెళ్లకుండా మహిళలపై ఆంక్షలు విధించినట్టు తాలిబన్ నైతిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ధర్మ ప్రచారం, అనైతిక ప్రవర్తన నివారణ (MPVPV) మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మహిళలు ఎవరూ ఎలాంటి ముందుస్తు వివరాలు అందివ్వకుండా పబ్లిక్ పార్కుల్లోకి వెళ్లడంపై ఆంక్షలు విధించినట్టు చెప్పారు.

కాబూల్ (Kabul) అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో బంపర్ కార్స్, ఫెర్సీస్ వీల్ రైడ్స్ వంటివి ఉంటాయి. తాలిబన్లు ఆంక్షలు విధించిన తర్వాత పార్క్ వద్దకు చేరుకున్న తాలిబన్ అధికారులు అక్కడున్న మహిళలను వెనక్కి పంపారు. తన మనవరాలితో పార్కుకు వచ్చిన ఓ మహిళ మాట్లాడుతూ.. పిల్లలతో పార్కుకు వచ్చే తల్లిదండ్రులను అనుమతించాలని కోరారు. చిన్నారులు పార్కులో ఆడుకుంటారని, అంతకుమించి వారేమీ చేయరని అన్నారు. తమను పార్క్‌లోనికి వెళ్లనివ్వాలని వారిని బతిమాలానని, అయినా అంగీకరించకపోవడంతో వెనక్కి వెళ్తున్నట్టు చెబుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను పార్కులోకి అనుమతించవద్దంటూ తాలిబన్ల నుంచి తమకు ఆదేశాలు అందాయని రెండు పార్కుల నిర్వాహకులు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మహిళలపై పలు ఆంక్షలు విధించారు. పురుషుడి తోడు లేకుండా ఇంటి నుంచి మహిళలు బయటకు రాకూడదని, వచ్చేటప్పుడు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఈ ఆంక్షలను పాటించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మహిళలను ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు. మార్చిలో బాలికల పాఠశాలను తిరిగి ప్రారంభిస్తామన్న తాలిబన్ల ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.

Updated Date - 2022-11-10T19:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising