రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ‘ఒదిగిన కాలం’
ABN, First Publish Date - 2022-03-06T08:58:56+05:30
క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయ అన్నారు. ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు.
ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయ స్వీయ ఆత్మకథ
హైదరాబాద్ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయ అన్నారు. ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆడవాళ్లకు వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లను స్ర్కీనింగ్ ద్వారా మొదటి దశలోనే గుర్తించి నివారించే చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. నోరి దత్తాత్రేయ రచించిన స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకాన్ని రాష్ట్రంలోని 400 గ్రంథాలయాలకు బహూకరించారు. ఈసందర్భంగా శనివారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌లకు నోరి దత్తాత్రేయ ఆ పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధునిక క్యాన్సర్ చికిత్స ఇమ్యునో థెరపీని సామాన్యులకు అందే విధంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
Updated Date - 2022-03-06T08:58:56+05:30 IST