ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణంలోనూ తోడుగా..

ABN, First Publish Date - 2022-09-11T09:54:21+05:30

మరణంలోనూ తోడుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ప్రతిలో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త ఆత్మహత్య


మహేశ్వరం/శంషాబాద్‌, సెప్టెంబరు 10: ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనారోగ్యం వల్ల భార్య ఆస్పత్రిలో కన్నుమూసిన కాసేపటికే రైలు కింద పడి బలవన్మరణం పొందాడు. పెళ్లి అయిన రెండున్నరేళ్లకే ఆ యువ దంపతులు అనంతలోకాలకు చేరుకోగా.. ఏడాది వయస్సు ఉన్న వారి కన్నబిడ్డ అనాథగా మిగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం చిన్నతూప్రాకు చెందిన బాలకృష్ణ(25)కు శంషాబాద్‌ మండలం కవేలిగూడకు చెందిన మమత(23)కు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయస్సు ఉన్న ఓ పాప ఉంది. మమత ఏడాదిగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న మమత శనివారం ఉదయం కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలకృష్ణ.. భార్య మరణ వార్తను కుటుంబసభ్యులకు తెలియజేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. అనంతరం మండల పరిధిలోని తొండిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. బాలకృష్ణ రైల్వే బ్రిడ్జి వద్ద ఉంచిన ద్విచక్రవాహనం ఆధారంగా పోలీసులు అతని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-11T09:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising