ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దోచుకునేందుకు ప్రయత్నించిన దొంగ.. 76 ఏళ్ల బామ్మ ఎలా కాపాడిందంటే..

ABN, First Publish Date - 2022-10-26T18:44:07+05:30

ఓ 76 ఏళ్ల వృద్ధ మహిళ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన పొరుగింటి వ్యక్తిని ఓ దొంగ బారి నుంచి కాపాడింది. తన చేతి కర్రతోనే దొంగను తరిమి కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ 76 ఏళ్ల వృద్ధ మహిళ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన పొరుగింటి వ్యక్తిని ఓ దొంగ బారి నుంచి కాపాడింది. తన చేతి కర్రతోనే దొంగను తరిమి కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌కు చెందిన 76 ఏళ్ల ఫాయే తన పొరుగింటి వ్యక్తిని కాపాడింది. అతడు దోపిడీకి గురి కాకుండా అడ్డుకుంది.

76 ఏళ్ల వయసులోనూ పరిగెత్తి దుర్మార్గులను తరిమికొట్టింది. ఆమె ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. కారులో వచ్చిన దుండగులు రోడ్డుపై ఉన్న వ్యక్తి నుంచి డబ్బు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితుడు తన డబ్బును గట్టిగా పట్టుకుని పోరాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన 76 ఏళ్ల ఫాయే అక్కడకు పరిగెత్తి తన చేతి కర్రను వారి పైకి విసిరింది. ఫాయేతో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా దొంగలను తిరిమింది. ఫాయే ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-10-26T19:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising