ఓయో రూమ్‌లే వాళ్ల టార్గెట్.. పక్కా స్కెచ్‌తో సీక్రెట్ కెమెరాలు.. ఆ తర్వాత ఏం చేసేవారంటే..
ABN, First Publish Date - 2022-10-23T12:24:45+05:30
నలుగురు స్నేహితులు.. పక్కా ప్లాన్ వేశారు. ఓయో రూమ్‌లే లక్ష్యంగా చేసుకున్నారు. సీక్రెట్ కెమెరాలు బిగించారు. ఆ తర్వాత అందులో రికార్డు అయిన కపుల్స్ వీడియోలను ఉపయెగించి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. అయితే.. తాజాగా వాళ్ల బండారం బయటడిం
ఇంటర్నెట్ డెస్క్: నలుగురు స్నేహితులు.. పక్కా ప్లాన్ వేశారు. ఓయో రూమ్‌లే లక్ష్యంగా చేసుకున్నారు. సీక్రెట్ కెమెరాలు బిగించారు. ఆ తర్వాత అందులో రికార్డు అయిన కపుల్స్ వీడియోలను ఉపయెగించి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. అయితే.. తాజాగా వాళ్ల బండారం బయటడింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విష్ణు సింగ్, అబ్దుల్ వహావ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్.. అనే నలుగురు స్నేహితులు నోయిడాలో నివసిస్తున్నారు. OYO Roomsను లక్ష్యంగా చేసుకుని డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌లో భాగంగా వీళ్లు తొలుత కొన్ని ఓయో రూమ్‌లను అద్దెకు తీసుకుని.. అందులో సీక్రెట్ కెమెరాలను బిగించారు. ఆ తర్వాత వాటిని వేకెట్ చేశారు. దీంతో తర్వాత అదే గదులను అద్దెకు తీసుకున్న జంటలకు సంబంధించిన దృశ్యాలు ఆ సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అలా రికార్డైన దృశ్యాలను.. కొన్ని రోజుల తర్వాత ఈ నలుగురు స్నేహితులు సేకరించారు. ఆ తర్వాత సదరు జంటలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు సేకరించి.. వాళ్ల వద్ద ఉన్న వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది బాధితులు పరువు పోతుందని అడిగినంత డబ్బు ముట్టజెప్పారు. కానీ ఓ వ్యక్తి మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వాళ్ల బండారం బయటపడింది. ఈ కేసుతో సంబంధం కలిగిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు తెలిపిన అధికారులు.. గాలింపు చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించారు. కగా.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2022-10-23T12:27:08+05:30 IST