ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bombay High Court: ఇంటి పనులు చేయలేనంటూ కోర్టికెక్కిన వివాహిత.. షాకిచ్చిన హైకోర్టు!

ABN, First Publish Date - 2022-10-28T12:17:56+05:30

ఇంటి పనులు చేయలేనంటూ కోర్టుకెక్కిన ఓ మహిళకు హైకోర్టు షాకిచ్చింది. భర్త, అత్తామామలపై చేసిన ఫిర్యాదును కొట్టేసింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు కోర్టు కీలక సూచనలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి పనులు చేయలేనంటూ కోర్టుకెక్కిన ఓ మహిళకు హైకోర్టు షాకిచ్చింది. భర్త, అత్తామామలపై చేసిన ఫిర్యాదును కొట్టేసింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు కోర్టు కీలక సూచనలు చేసింది. కాగా.. కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన ఓ మహిళకు కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తొలి రోజుల్లో ఆమెతో అత్తింటి వాళ్లు ఆమెతో ఏ పనీ చేయనీయలేదు. కానీ ఆ తర్వాత ఇంట్లో పని చేయాల్సిందింగా చెప్పారు. భర్త, అత్తామామలు చెప్పినట్టే కొన్ని రోజులు ఇంటి పని చేసిన ఆమె.. తర్వాత కోర్టు మెట్లెక్కింది. భర్త, సహా అత్తామామలపై ఫిర్యాదు చేసింది. పెళ్లైన మొదట్లో తనను బాగానే చూసుకున్నారని.. కానీ ఆ తర్వాత ఇంటి పని మనిషిగా చూడటం మొదలుపెట్టారని ఆరోపిస్తూ గృహహింస, క్రూరత్వం కేసులు పెట్టింది. అంతేకాకుండా.. అంతేకాకుండా కారు కొనుగోలు చేయడానికి రూ.4లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారని.. భౌతికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసుపై బాంబే హైకోర్టు(Bombay High Court)కు చెందిన ఔరంగాబాద్ బెంచ్ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహిత చేసే ఇంటి పనిని.. పని మనిషితో చేసే పనితో పోల్చద్దని.. ఇది క్రూరత్వం, గృహహింస కిందకు రాదని(domestic work is not cruelty) పేర్కొంది. అంతేకాకుండా.. క్రూరంగా హింసించారనడానికి సరైన ఆధారాలు చూపనందున క్రూరత్వం, గృహహింసకు సంబంధించిన కేసులను కోర్టు కొట్టేసింది. పెళ్లైన తర్వాత ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే.. ఆ విషయాన్ని పెళ్లికి ముందే తెలియజేయాలని వెల్లడించింది. ఒకవేళ పెళ్లైన తర్వాత తనకు ఇంటి పని చేయడం ఇష్టం లేదని వివాహిత(married woman) చెబితే.. అందుకు అత్తామామలు పరిష్కారం కనుక్కోవాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.

Updated Date - 2022-10-28T13:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising