మైక్రోవేవ్ ఓవెన్ వేడిని ఎలా గ్రహించి, ఆహారాన్ని సిద్ధం చేస్తుందో తెలిస్తే...
ABN, First Publish Date - 2022-10-26T08:02:16+05:30
ప్రతి రంగంలోనూ టెక్నాలజీ విస్తరిస్తోంది. వాటిలో ఒకటే వంటకు ఉపకరించే సాధనం మైక్రో ఓవెన్. ఇది ఆహార పదార్థాలను వండడానికి లేదా వేడి చేయడానికి ఉపయోగించే ఒక సాధనం.
ప్రతి రంగంలోనూ టెక్నాలజీ విస్తరిస్తోంది. వాటిలో ఒకటే వంటకు ఉపకరించే సాధనం మైక్రో ఓవెన్. ఇది ఆహార పదార్థాలను వండడానికి లేదా వేడి చేయడానికి ఉపయోగించే ఒక సాధనం. అనేక రకాల మైక్రోవేవ్ ఓవెన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ మైక్రోవేవ్ ఓవెన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోవేవ్ ఓవెన్ టెక్నాలజీ ఇతర ఓవెన్ల కంటే భిన్నమైనది. ఇందులో ఆహారాన్ని వండడానికి లేదా వేడి చేయడానికి మైక్రోవేవ్ రేడియేషన్ ఉపయుక్తమవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ముందుగా మైక్రోవేవ్ రేడియేషన్‌ను అర్థం చేసుకోవడం అవసరం. మైక్రోవేవ్‌లు విద్యుదయస్కాంత వికిరణం యొక్క ఒక రూపం. దీనిలో అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి ఉంటాయి. మైక్రోవేవ్‌లను రొట్టెలు, డోనట్‌ల తయారీలోనూ, బంగాళాదుంప చిప్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు.
మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి, ఆహారాన్ని చాలా త్వరగా, సమర్ధవంతంగా వండవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ దృఢమైన మెటల్ బాక్స్ కలిగివుంటుంది. దానిలో మైక్రోవేవ్ జనరేటర్ ఉంటుంది. దీనిని మాగ్నెట్రాన్ అంటారు. వంట చేయడం ప్రారంభించినప్పుడు, మాగ్నెట్రాన్ పవర్ అవుట్‌లెట్ నుండి శక్తిని తీసుకుంటుంది. వంట కోసం ఓవెన్ లోపల టర్న్ టేబుల్ మీద ఆహారాన్ని ఉంచుతారు. ఇది నెమ్మదిగా తిరుగుతుంది, తద్వారా మైక్రోవేవ్ కిరణాలు ఆహారంపై సమానంగా ప్రసరిస్తాయి. మైక్రోవేవ్‌లు ఆహారంలోకి ప్రవేశించిన వెంటనే, ఆహారంలో ఉన్న నీటి అణువులు వేగంగా కంపించడం ప్రారంభిస్తాయి. దీని వల్ల వాటిలో వేడి పుట్టి ఆహారం వేడిగా మారుతుంది.
Updated Date - 2022-10-26T08:02:33+05:30 IST