Commercial LPG cylinder : తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
ABN, First Publish Date - 2022-11-01T07:47:46+05:30
కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. మంగళవారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు(LPG cylinder price) తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.నవంబరు 1వతేదీ నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్(commercial LPG cylinder) ధర రూ.115.50 తగ్గింది.
న్యూఢిల్లీ: కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. మంగళవారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు(LPG cylinder price) తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.నవంబరు 1వతేదీ నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్(commercial LPG cylinder) ధర రూ.115.50 తగ్గింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అల్లాడుతున్న ప్రజలకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు ఉపశమనంగా మారింది.(huge relief to customers)అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గడంతో ఈ మార్పు చేసినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. అయితే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,885 నుంచి రూ. 1,744కి తగ్గించారు. డొమెస్టిక్ ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.1,053గా యథాతథంగా ఉంచారు.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు కోల్‌కతాలో రూ.1846, ముంబైలో రూ.1696, చెన్నైలో రూ.1893గా ఉంది.
Updated Date - 2022-11-01T07:47:48+05:30 IST