ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన సంవత్సరం వేళ... ఉజ్జయినిలో ప్రత్యేక ఏర్పాట్లు!

ABN, First Publish Date - 2022-12-28T07:46:09+05:30

దేశంలోని ప్రతి శివభక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరుడిని దర్శించుకోవాలని కోరుకుంటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలోని ప్రతి శివభక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరుడిని దర్శించుకోవాలని కోరుకుంటాడు. మహాకాళేశ్వరుడు కొలువైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో నూతన సంవత్సరం వేళ భక్తుల రద్దీ నెలకొంటుంది. భోలేనాథుడిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఉజ్జయినికి వస్తారు.

రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు శుభవార్త చెప్పారు. ఇప్పుడు మహాకాళీశ్వరుని శీఘ్ర దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకొని కొన్ని నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. సాధారణంగా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకుంటూ చాలామంది తమ కుటుంబంతో కలిసి దేవాలయానికి లేదా తీర్థయాత్రకు వెళ్లి భగవంతుని ఆశీస్సులు పొందుతుంటారు.

ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉజ్జయినికి తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు భక్తులు కేవలం 40 నిమిషాల్లో మహాకాళుని దర్శనం చేసుకోవచ్చు. ఇందుకోసం వారు ఆన్‌లైన్ టిక్కెట్‌ను తీసుకోవాలి, దీని ధర రూ. 250. టికెట్ బుక్ చేసుకునే భక్తులు దాని ప్రింటవుట్ తీసుకురావాల్సి ఉంటుంది. కాగా ఈనెల 31 అంటే శనివారం నుండి మహాకాళ్ ఆలయ గర్భగుడిలోకి అన్ని వర్గాల భక్తుల ప్రవేశాన్ని నిలిపివేయనున్నారు. గణేష్ మండపం నుంచే భక్తులకు మహాకాళేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఈ విధానం జనవరి 5 వరకు ఉంటుంది.

Updated Date - 2022-12-28T07:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising