Army Jawans killed: ఘోర ట్రక్కు ప్రమాదం...16 మంది భారత జవాన్ల మృతి
ABN, First Publish Date - 2022-12-23T15:46:20+05:30
నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేఓలు..
గ్యాంగ్‌టక్: నార్త్ సిక్కింలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేఓలు (Junior Commossioned Officers), 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది.
రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి...
నార్త్ సిక్కింలో జరిగిన ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరజవాన్లు అందించిన సేవలు, నిబద్ధతను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు.
Updated Date - 2022-12-23T16:02:59+05:30 IST