ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4th Generation HIV Rapid Test: 4వ తరం ర్యాపిడ్ టెస్టులతో అంతరాల తొలగింపు

ABN, First Publish Date - 2022-11-29T21:43:16+05:30

దేశంలో సుమారు 23.5 లక్షల మంది హెచ్ఐవీ(HIV)తో బాధపడుతున్నారు. అయితే, వీరిలో 17.8 లక్షల మందికి

Rapid Test
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశంలో సుమారు 23.5 లక్షల మంది హెచ్ఐవీ(HIV)తో బాధపడుతున్నారు. అయితే, వీరిలో 17.8 లక్షల మందికి మాత్రమే తమ స్థితి గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. కరోనా సమయంలో వ్యాధి నిర్ధారణ కోసం వీరిలో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజానికి యూఎన్ఎయిడ్స్ ఆశయం మొత్తం హెచ్ఐవీ పాజిటివ్ రోగుల్లో 95 శాతం మందిని పరీక్షించడం. ఫలితంగా 2030 నాటికి నూతన హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ల ముగింపు పలికేందుకు తోడ్పడుతుంది.

హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌ (ముంబై) కన్సల్టెంట్, యూనిసన్ మెడికేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ముంబై, ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా హెచ్‌ఐవీ భారం గణనీయంగా ఉందన్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులుగా భావిస్తున్న వారిలో 79.4 శాతం మందికి మాత్రమే టెస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన వారికి రోగనిర్ధారణ పరిష్కారాల లభ్యతకు గల అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పటిష్టమైన నియంత్రణ ప్రక్రియల కింద వేగవంతమైన పాయింట్-ఆఫ్-కేర్ పరీక్షలు వంటి సాధారణ, స్కేలబుల్ హెచ్ఐవీ టెస్టింగ్ విధానాలను ఉపయోగించడం ద్వారా అటువంటి అంతరాలను పూరించవచ్చని తెలిపారు.

ప్రొఫెషనల్స్‌తో క్లినికల్ సెట్టింగ్స్‌లో నిర్వహించే ర్యాపిడ్ హెచ్ఐవీ స్క్రీనింగ్ వంటి వాటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ వంటివి సకాలంలో ఇన్ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఎంతో ముఖ్యం. 20 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితం తెలియడం వల్ల అది డయాగ్నస్టిక్స్ కు యాక్సెస్‌ను మెరుగు పరుస్తుంది. 4వ తరం సాంకేతిక ఆధారిత ర్యాపిడ్ టెస్ట్‌లతో నేడు పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ ప్రమాణాలు నిరంతరం వృద్ధి చెందుతూ ఉన్నాయి. గత తరాలకు చెందిన 2వ, 3వ తరాల టెస్ట్‌ల కంటే అవి సమున్నతంగా ఉంటున్నాయి. ఈ నూతన టెస్టులను ఉపయోగించడం ఎంతో సులభం. ప్రస్తుతం విని యోగంలో ఉన్న3వతరం ర్యాపిడ్ టెస్ట్ లలో గుర్తించలేని 28శాతం ఇన్ఫెక్షన్లను కూడా అవి గుర్తించగలుగుతాయి. తద్వారా మరెంతో మంది తమ ఇన్ఫెక్షన్ల స్థాయి గురించి తెలుసుకోగలుగుతారు. హెచ్ఐవీ యాంటీబాడీలతో పాటు ఇన్ఫెక్షన్ సోకిన 15-25 రోజుల తరువాత కనిపించే యాంటీజెన్ రెండింటినీ గుర్తించగలిగే సామర్థ్యంతో ఈ టెస్టులు సత్వర నిర్ధారణకు వీలు కల్పిస్తాయి. తద్వారా తక్కువ సమయంలోనే మరింత కచ్చితమైన ఫలితాలను ఇవి అందిస్తాయి.

అబాట్ ర్యాపిడ్ డయాగ్నస్టిక్స్ బిజినెస్ జనరల్ మేనేజర్ సునీల్ మెహ్రా మాట్లాడుతూ.. 4వ తరం పాయింట్-ఆఫ్-కేర్ టెస్టింగ్ కొత్త ప్రామాణిక టెస్టింగ్‌ను ప్రతిబింబిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. హెచ్ఐవీ పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించడానికి ఇది సాయపడుతుందన్నారు. దేశంలో హెచ్ఐవీ భారాన్ని తగ్గించడంలో సాయపడడానికి తాము ఈ నూతన తరం సాధనాలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలకు అండగా నిలుస్తున్నట్టు చెప్పారు.

4వ తరం టెస్టింగ్, అధిక సున్నితత్వం, నిర్దిష్టతతో మరింత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌లను కూడా గుర్తిస్తుంది. ఈ విధమైన ఇన్ఫెక్షన్లు మునుపటి తరం పరీక్షలతో పోలిస్తే పరీక్షలను కోరుకునే వ్యక్తులలో 5 నుండి 20 శాతం హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్‌ వరకూ ఉంటాయి. 3వ తరం పరీక్షల ద్వారా గుర్తించబడిన సాధారణంగా 20 రోజులు లేదా తరువాతి కాల వ్యవధితో గుర్తించడంతో పోలిస్తే, ఇంకా త్వరగానే అంటే, హెచ్ఐవీ సంక్రమణతో జీవించిన 12 రోజులలోనే గుర్తించే విండో వ్యవధిని తగ్గించడంలో సాయపడుతుంది.

Updated Date - 2022-11-29T21:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising