మాల్దీవుల్లో 9 మంది భారతీయుల ఆహుతి
ABN, First Publish Date - 2022-11-11T03:34:58+05:30
మాల్దీవుల రాజధాని మాలెలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు.
మాలె, నవంబరు 10: మాల్దీవుల రాజధాని మాలెలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. వారిలో 9 మంది భారతీయులు. మరొకరిది బంగ్లాదేశ్. వీరు నివసిస్తున్న ఇరుకైన భవనంలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు గ్యారేజీ నుంచి మంటలు చెలరేగి ఫస్ట్ ఫ్లోర్‌కు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు 4 గంటల పాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన పలువుర్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మొదటి అంతస్తులో 10 మృతదేహాలను గుర్తించారు. ఈ దుర్ఘటనపై భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. వలస కార్మికులు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఈ విషాదం మరోసారి తెలియజేస్తోందని మాల్దీవుల్లోని రాజకీయ పార్టీలు విమర్శించాయి.
Updated Date - 2022-11-11T03:34:59+05:30 IST