ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meta : తల్లికి ఉద్యోగం పోయినందుకు సంతోషిస్తున్న కూతురు

ABN, First Publish Date - 2022-12-11T12:36:32+05:30

పిల్లల్ని పోషించడం కోసం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పడం లేదు. తల్లిదండ్రులు తీరిక లేకుండా

Meta
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పిల్లల్ని పోషించడం కోసం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పడం లేదు. తల్లిదండ్రులు తీరిక లేకుండా పని చేస్తుండటంతో పిల్లలు వారి ప్రేమాదరాలకు నోచుకోలేకపోతున్నారు. అందుకే ఓ ఆరేళ్ళ చిన్నారి తన తల్లికి ఉద్యోగం పోయిందంటే చాలా సంతోషపడింది. మనిద్దరం ఎక్కువసేపు గడపవచ్చునని ఆనందంతో చిందులు వేసింది.

షెల్లీ కలిష్ (Shelly Kalish) గత ఏడాది జూన్ నెలలో ఫేస్‌బుక్‌లో ఉద్యోగంలో చేరారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో చిన్న కుమార్తె వయసు ఆరేళ్ళు. మెటా (Meta) గత నెలలో దాదాపు 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ విధంగా ఉద్యోగాన్ని కోల్పోయినవారిలో షెల్లీ ఒకరు. మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నిర్ణయంతో చాలా మంది మేనేజర్లు హతాశులయ్యారు. కొందరిని తొలగిస్తారనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ, కళ్ళ ముందు ప్రపంచం కనిపించనంత అంధకారం అలముకుంది.

షెల్లీ కలిష్ తన అనుభవాన్ని వివరిస్తూ, తాను నవంబరు 11న ఉదయం 6.30 గంటలకు ఫోన్ చూసినపుడు, చాలా సుదీర్ఘమైన ఈ-మెయిల్ తనకు వచ్చిందన్నారు. దానిని చదివినపుడు తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుసుకున్నానని చెప్పారు. దానిలో ఉన్నవాటిలో రెండు వాక్యాలకు మించి తాను చదవలేకపోయానని చెప్పారు. లేఆఫ్‌లో తన పేరు కూడా ఉందని మొదటి వాక్యాల్లోనే చెప్పేశారన్నారు. వెంటనే చదవడం ఆపేసి, తన భర్తకు ఫోన్ చేసినట్లు తెలిపారు. తన భర్త, పిల్లలు తన వద్దకు వచ్చి, తనను ఆలింగనం చేసుకున్నారని చెప్పారు.

అదే రోజు సాయంత్రం తన చిన్న కుమార్తె (వయసు ఆరు సంవత్సరాలు)ను వాకింగ్‌కు తీసుకెళ్ళానని, తన ఉద్యోగం పోయిందని చెప్పానని తెలిపారు. ‘‘వాళ్ళకి ఇంక నువ్వు ఎందుకు అక్కర్లేదు’’ అని తన కుమార్తె అడిగిందన్నారు. ‘‘ఇంక నువ్వు నాతో మరింత ఎక్కువ సమయం గడపవచ్చు’’ అని సంతోషంగా అన్నట్లు తెలిపారు.

తన కుమార్తె మాటలకు తాను చిరునవ్వు నవ్వడం తప్ప ఏమీ అనలేకపోయానని చెప్పారు. ‘‘నీతో, నీ అక్కతో ఎక్కువ సమయం గపడటం నాకు ఎంతో బాగుంటుంది. కానీ పని చేయడమంటే నాకు ఇష్టం. పని చేయడం నాకు సంతోషంగా ఉంటుంది. త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పానని తెలిపారు. ఉద్యోగాన్ని కోల్పోవడం చాలా బాధాకరమని, తన కుమార్తె మాటలు తనను మరో విధంగా ఆలోచించేలా చేశాయని తెలిపారు. ‘‘నీ ఉద్యోగం పోయినందుకు బాధగా ఉంది, అయినప్పటికీ నువ్వు మంచి అమ్మవి’’ అని తన చిన్న కుమార్తె తనకు చెప్పిందన్నారు.

Updated Date - 2022-12-11T12:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising