ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Election Results: ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి పరాజయం

ABN, First Publish Date - 2022-12-08T16:50:14+05:30

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరో బిగ్ షాక్ తగిలింది.

Arvind Kejriwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరో బిగ్ షాక్ తగిలింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ (Isudan Gadhvi ) పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని ఖంబాలియా నుంచి పోటీచేసిన గధ్వీని భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి ములూ భాయ్ బేరా (Mulubhai Hardasbhai Bera) ఓడించారు. 1900 ఓట్ల పైచిలుకు తేడాతో ఆప్ సీఎం అభ్యర్థి ఓడిపోయారు.

వాస్తవానికి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, అధికారంలోకి వస్తామని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బలంగా చెప్పారు. ఢిల్లీ మోడల్ చూసి ప్రజలు ఓటేస్తారని అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తదితరులు ప్రచారం చేశారు. పంజాబ్ తరహా విజయం సాధిస్తామని మాన్ తదితరులు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా మాన్ మాట్లాడుతూ గుజరాత్‌లో ఆప్ అద్భుతాలు చేయబోతుందన్నారు. తీరా చూస్తే ఫలితాల్లో ఆప్ చతికిలపడింది. పై పెచ్చు స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఓడిపోవడం కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీ చేసిన చాలా చోట్ల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ విరాట్ స్వరూపం చూపిస్తుందని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలెవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఫలితాలు చూసి షాకవుతున్నారు.

అటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆప్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఎంసీడీలో మాత్రం ఆప్ సత్తా చాటగలిగింది. 250 వార్డులకు గానూ 134 స్థానాలు గెలుచుకుంది.

Updated Date - 2022-12-08T17:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising