Gujarat Assembly Polls : వస పిట్టల గుంపు ఆమ్ ఆద్మీ పార్టీ : బీజేపీ
ABN, First Publish Date - 2022-10-13T19:09:46+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఆప్ కార్యకర్తలు గ్రామీణులను ఆకట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఆప్ నేతలను వస పిట్టల గుంపుగా అభివర్ణించారు.
బీజేపీ నిర్వహిస్తున్న గుజరాత్ గౌరవ్ యాత్ర (Gujarat Gaurav Yatra)లో పాల్గొనేందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆప్ నేతలు ప్రచారం చేస్తున్న ‘ఢిల్లీ మోడల్’ ను ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించనివారంటే తనకు చాలా భయమని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే చాలా ఎక్కువగా మాట్లాడేవారి గుంపు అని ఎద్దేవా చేశారు. ఆప్ నేతలు చెప్తున్న ఢిల్లీ మోడల్‌ను ప్రశ్నించారు. వారు నిజాయితీపరులైతే, మీడియాను ఢిల్లీకి తీసుకెళ్ళి, ఆ మోడల్‌ను చూపించాలన్నారు. ఎటువంటి బాధ్యతను ప్రదర్శించనివారంటే తనకు భయమని, వీరు అలాంటి గుంపు అని తెలిపారు. ఈసారి కూడా గుజరాత్ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్ గౌరవ్ యాత్రను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బీజేపీ నేతలు దీనిలో పాల్గొన్నారు.
Updated Date - 2022-10-13T19:09:46+05:30 IST