డిస్టెన్స్ విద్యార్థులకు అకడమిక్ బ్యాంక్ అకౌంట్
ABN, First Publish Date - 2022-11-01T02:44:09+05:30
దేశంలో ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులు అందించే విద్యాసంస్థలన్నీ తప్పనిసరిగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు.
యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్
న్యూఢిల్లీ, అక్టోబరు 31: దేశంలో ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులు అందించే విద్యాసంస్థలన్నీ తప్పనిసరిగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు. జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థులు వారి ఆసక్తులకు అనుగుణంగా విభిన్న సబ్జెక్టులను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గతంలో చదివిన సబ్జెక్టులు, క్రెడిట్ల వివరాలను విద్యాసంస్థలు పరిశీలిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నీ తమ పరిధిలోని విద్యార్థుల కోసం ఏబీసీని రూపొందించుకోవాలని యూజీసీ ఛైర్మన్ తెలిపారు.
Updated Date - 2022-11-01T02:44:10+05:30 IST