ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jacqueline : నటి జాక్విలిన్‌ను అరెస్టు చేయలేదేం?

ABN, First Publish Date - 2022-11-11T03:56:37+05:30

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈడీని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 10: మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ప్రశ్నించింది. ఆమెపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసినప్పటికీ అరెస్టు చేయకపోవడాన్ని ఎత్తిచూపింది. ఇతర నిందితుల్ని అరెస్టు చేసి, ఆమెను మినహాయించారని తెలిపింది. ఈ ‘ఎంపిక విధానం’ ఏమిటని ప్రశ్నించింది. ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ సహా ఇతరులకు సంబంధం ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆమెపై ఆగస్టు 31న అభియోగాలు నమోదయ్యాయి. ఆమెకు సెప్టెంబరు 26న కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా, ప్రత్యేక జడ్జి శైలేంద్ర మాలిక్‌ విచారణ జరిపారు. ఆమెకు డబ్బు కొరత లేనందున దేశం నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, బెయిల్‌ ఇవ్వకూడదని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. జడ్జి స్పందిస్తూ ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేని ప్రశ్నించారు. ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దర్యాప్తు పూర్తయిందని, ఛార్జిషీటు కూడా దాఖలైందని తెలిపారు. అందువల్ల అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, బెయిల్‌ ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-11-11T03:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising