Airport: 4 నుంచి విమానాశ్రయంలో కొత్త పార్కింగ్
ABN, First Publish Date - 2022-12-01T11:18:39+05:30
చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో కొత్తగా నిర్మించిన అధునాతన భవనంలోని మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సదుపాయం డిసెంబరు 4వ తేదీ నుంచి
చెన్నై, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో కొత్తగా నిర్మించిన అధునాతన భవనంలోని మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సదుపాయం డిసెంబరు 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఇందులో వాహనాల పార్కింగ్ ఫీజుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అరగంట వరకు టూ వీలర్‌కు రూ.20, ఫోర్ వీలర్‌కు రూ.75, అరగంట నుంచి గంట వరకు టూ వీలర్‌కు రూ.20, ఫోర్ వీలర్‌కు రూ.100, గంట నుంచి 2 గంటల వరకు టూ వీలర్‌కు రూ.30, ఫోర్ వీలర్‌కు రూ.150, 2 గంటల నుంచి 3 గంటల వరకు టూ వీలర్‌కు రూ.40, ఫోర్ వీలర్‌కు రూ.200, 3 గంటల నుంచి 4 గంటల వరకు టీ వీలర్‌కు రూ.50, ఫోర్ వీలర్‌కు రూ.250, 4 నుంచి 5 గంటల వరకు టీ వీలర్‌కు రూ.55, ఫోర్ వీలర్‌కు రూ.280, 5 నుంచి 6 గంటల వరకు టూ వీలర్‌కు రూ.60, ఫోర్ వీలర్‌కు రూ.310, 6 నుంచి 7 గంటల వరకు టూ వీలర్‌కు రూ.65, ఫోర్ వీలర్‌కు రూ.340 వసూలు చేయనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2022-12-01T11:18:41+05:30 IST