ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amitabh Bachchan: ఢిల్లీ హైకోర్టులో అమితాబ్ బచ్చన్ దావా

ABN, First Publish Date - 2022-11-25T12:43:41+05:30

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) శుక్రవారం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు.

Amitabh Bachchan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) శుక్రవారం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. తన పేరు, ప్రతిష్ఠ, గళం, వ్యక్తిత్వ గుర్తింపు లక్షణాలను పరిరక్షించాలని కోరారు. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే ఆయన తరపున వాదనలు వినిపించారు. అమితాబ్ ప్రచార హక్కులకు ఎవరూ భంగం కలిగించరాదని జస్టిస్ నవీన్ చావ్లా తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు.

ప్రతివాదులు తమ స్వంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం అమితాబ్ అనుమతి లేకుండా ఆయన పేరు, ప్రతిష్ఠలు, సెలబ్రిటీ హోదాలను ఉపయోగించుకుంటున్నట్లు ధర్మాసనం గుర్తించింది. ప్రతివాదుల కార్యకలాపాల వల్ల అమితాబ్‌కు పూడ్చడం సాధ్యం కానటువంటి నష్టం, హాని జరిగే అవకాశం ఉందని, ఆయనకు అపఖ్యాతిని తెచ్చిపెట్టవచ్చునని తెలిపింది.

కౌన్ బనేగా క్రోర్‌పతి (KBC)తో చట్టవిరుద్ధంగా అసోసియేట్ అయి లాటరీలను నిర్వహించేందుకు మొబైల్ అప్లికేషన్ డెవలపర్లు తన పేరు, ఫొటో, వాయిస్‌‌లను వాడుకుంటున్నారని కోర్టుకు బచ్చన్ తెలిపారు. పుస్తకాల ప్రచురణకర్తలు, టీ-షర్ట్‌ల అమ్మకందారులు, ఇతర వ్యాపారులు తన ప్రచార హక్కులను ఉల్లంఘించకుండా నిరోధక ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు.

బచ్చన్ పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే ఏడాది మార్చిలో జరుగుతుంది.

Updated Date - 2022-11-25T12:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising