ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anil Kumar Reddy: సమాజానికి కవులు దిక్సూచిలాంటివారు

ABN, First Publish Date - 2022-08-21T14:05:08+05:30

సమాజానికి కవులు, రచయితలు దిక్సూచి లాంటి వారని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కె.అనిల్‌కుమార్‌రెడ్డి(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - ‘గాండ్లమిట్ట’ పుస్తకావిష్కరణలో అనిల్‌కుమార్‌రెడ్డి


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 20: సమాజానికి కవులు, రచయితలు దిక్సూచి లాంటి వారని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కె.అనిల్‌కుమార్‌రెడ్డి(Anil Kumar Reddy) పేర్కొన్నారు. స్థానిక పెరంబూర్‌లోని వసంత మాలిగై వేదికగా శనివారం ఉదయం జనని సాంఘీక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత ఆర్‌సీ కృష్ణస్వామిరాజు రచించిన ‘గాండ్లమిట్ట (కథా సంపుటి)’ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు సభకు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా కె.అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ఆవిష్కరించిన గాండ్లమిట్ట పుస్తక తొలిప్రతిని తిరుత్తణికి చెందిన బాలసాహితీవేత్త ఓట్ర ప్రకాశ్‌రావ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... తెలుగు భాష, సాహిత్యంపై తనకు అమితమైన ఆసక్తి అని ఉద్ఘాటించారు. రచయిత రాసిన పుస్తకంపై స్పందించిన ఆయన, ఒక్కో కథ సామాజిక దృక్పథంతో కూడుకొని ఉందని, సమాజంలో చైతన్యం కలిగించేలా కథలు ఉన్నాయన్నారు. రాజధాని కళాశాల తెలుగు శాఖ సహాయాచార్యులు డా.ఎన్‌.ఎలిజబెత్‌ జయకుమారి(Dr. N. Elizabeth Jayakumari) పుస్తక సమీక్ష చేస్తూ.. గాండ్లమిట్ట పుస్తకంలో 20 కథలు, శీర్షికలు పెట్టడంలోనే రచయిత శైలి స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. రచయిత ఆర్‌సీ కృష్ణస్వామిరాజు తన స్పందనలో.. ఇది తన పదవ పుస్తకం అని, మహానగరం చెన్నై సహా ఉభయరాష్ట్రాల్లో తెలుగు భాష విశిష్టతను పలు కార్యక్రమాల ద్వారా చాటిచెబుతున్న జనని సంస్థ తరఫున తన పుస్తకాన్ని ఆవిష్కరించడం మహా ఆనందంగా ఉందన్నారు. సామాజిక బాధ్యతతో పుస్తకాలు రాస్తానని ఆయన హామీ ఇచ్చారు. అరుణా శ్రీనాథ్‌ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ....’ ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమ నిర్వహణను నిడమర్తి వసుంధర నిర్వహించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య(Chennayya of Gudimetla) వందన సమర్పణ చేస్తూ.. కవులు దేశానికి వెన్నెముకని, రచయితల కలం నుంచి జాలువారే పదాలు బుల్లెట్‌లా శక్తివంతమైనవని పేర్కొన్నారు. నగరంలో నిర్వహించే తెలుగు సభలకు నిండుదనం చేకూర్చేలా తెలుగువారు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-21T14:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising