Asaduddin Owaisi: ఓట్ల కోసమే ఉమ్మడి పౌరస్మృతి అంశం లేవనెత్తిన బీజేపీ
ABN, First Publish Date - 2022-10-30T15:09:38+05:30
వడ్గాం: హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు.
వడ్గాం: హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో (Gujarat elections) ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి (Uniform civil code) అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు. ''యూనిఫాం సివిల్ కోడ్ స్వచ్ఛందంగా ఉండాలని, తప్పనిసరి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పింది నిజం కాదా? బీజేపీ మాత్రం హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లేందుకు, ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం ఒక అలవాటుగా మార్చుకుంది'' అని ఆయన విమర్శించారు.
''ముస్లింలకు వివాహం ఒక కాంట్రాక్టు, హిందువులకు జీవితాంతం కొనసాగుతుంది. ఇదే ఇండియాలోని భిన్నత్వం. రాజ్యాంగంలోని 25,26,14,20 ఆర్టికల్స్ ద్వారా ఇది సాధ్యమైంది. యూసీసీ అమలు ద్వారా మైనారిటీ హక్కులను పరిరక్షించే ఆర్టికల్ 29కి వ్యతిరేకంగా ఎవరైనా చట్టం చేస్తారా?'' అని ఒవైసీ ప్రశ్నించారు.
హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ కింద ఆదాయం పన్ను రిబేట్ ప్రయోజనాల నుంచి ముస్లింలు, క్రైస్తవులను ఎందుకు మినహాయించారని ప్రధానమంత్రిని తాను అడుగుతున్నానని అన్నారు. ఇది సమానత్వ హక్కుకు వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి అన్ని కోణాల నుంచి మదింపు చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శనివారంనాడు ప్రకటించిన నేపథ్యంలో ఒవైసీ తాజా వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-10-30T15:19:51+05:30 IST