Sharath Kumar: రాజరాజ చోళన్ ఏ మతస్థుడు అయితే ఏంటి?
ABN, First Publish Date - 2022-10-09T15:49:16+05:30
మహారాజు రాజరాజ చోళన్ ఏ మతస్థుడు అయితే మనకేంటి? అస్సలు ఆయన ఏ మతస్థుడన్న చర్చ ఇపుడు అవసరమా? అంటూ సినీ నటుడు, అఖిల భారత
- నటుడు శరత్ కుమార్ ప్రశ్న
అడయార్(చెన్నై), అక్టోబరు 8: మహారాజు రాజరాజ చోళన్ ఏ మతస్థుడు అయితే మనకేంటి? అస్సలు ఆయన ఏ మతస్థుడన్న చర్చ ఇపుడు అవసరమా? అంటూ సినీ నటుడు, అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఆర్. శరత్ కమార్(R. Sharath Kumar) ప్రశ్నించారు. ఇదే విషయంపై ఆయన శనివారం ఒక సుదీర్ఘ ప్రకటన చేశారు. ఇందులో రాజరాజ చోళన్‌పై జరుగుతున్న చర్చను, చెలరేగిన వివాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. రాజ రాజ చోళన్ ఏ మతస్థుడు అయితే మనకేంటి? అని ప్రశ్నించిన శరత్ కుమార్, ఆ రాజు కాలంలో జరిగిన అభివృద్ధి, నిర్మించిన ఆలయ చరిత్రను చూడాలని కోరారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తంజావూరు(Thanjavur) బృహదీశ్వర ఆలయాన్ని ప్రజలకు అంకితం చేసిన మహారాజు రాజ రాజ చోళన్ అని, ఆయన పేరు ప్రఖ్యాతులు, ఖ్యాతిని ఈ ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ ఉత్సుకత ఉంటే ఎంతో బాగుండేదని ఈ చర్చకు తెరలేపిన వారికి చురకలు అంటించారు.
Updated Date - 2022-10-09T15:49:16+05:30 IST