ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CJI Chandrachud :ప్రభుత్వమే పెద్ద లిటిగెంటు!

ABN, First Publish Date - 2022-11-11T03:54:17+05:30

దేశంలో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల సంఖ్య పెంచడంతో పాటు కేసుల నిర్వహణ, నాణ్యత కూడా

CJI Chandrachud
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోర్టుల్లో పోరాటాలు తగ్గించుకోవాలి..

ప్రత్యామ్నాయ విధానాలు పాటించాలి

కొత్త చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబరు 10: దేశంలో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల సంఖ్య పెంచడంతో పాటు కేసుల నిర్వహణ, నాణ్యత కూడా బాగుండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధికం ప్రభుత్వానికి సంబంధించినవేనని.. సర్కారే అతిపెద్ద లిటిగెంట్‌ అని గురువారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ఓ విధానం తీసుకురావాలని, కోర్టుల్లో పోరాటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కోర్టు వెలుపల పరిష్కారాలు, మధ్యవర్తిత్వం, టెక్నాలజీ వాడకం వంటి ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార విధానాలు పాటించాలని సూచించారు. పెండింగ్‌ కేసులు తగ్గించేందుకు.. తరచూ వాయిదాల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, నిరర్థక కేసులు ఏరివేయాలని తెలిపారు. హైకోర్టుల్లో 1,108 మంది న్యాయమూర్తులు ఉండాలని.. ఇందులో 30 శాతం పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌ కేసులను ఎదుర్కోవాలంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా భర్తీ చేయాలన్నారు. ప్రతి రాజ్యాంగ కోర్టు న్యాయమూర్తి తన పదవీస్వీకార ప్రమాణానికి అనుగుణంగా.. భయం, పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని.. కేసును పరిష్కరించేటప్పుడు రాజ్యాంగ విలువలైన వ్యక్తి గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. పౌరుల హక్కుల సంరక్షకులమన్న విషయం గుర్తెరగగాలని హితవు పలికారు. ఏ కేసూ చిన్నది కాదని తెలుసుకోవాలన్నారు.

వ్యక్తిగత స్వేచ్ఛ నిరాకరణ, పెన్షన్‌ నిలిపివేత, భూసేకరణ లేదా కబ్జా వంటివి మానవ జీవితాలపై ఎనలేని ప్రభావం చూపుతాయని.. న్యాయమూర్తి దయతో, వివేకంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. భిన్న ఆలోచనలను, అభిప్రాయాలను స్వాగతించాలని.. కేసును పరిష్కరించే క్రమంలో ముందుగానే ఓ అభిప్రాయానికి రావడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలే వెళ్లి న్యాయం అభ్యర్థించే వలసవాద న్యాయ విధానం స్థానంలో నేరుగా పౌరులకే సత్వర న్యాయం అందించే విధానాన్ని అందుబాటులోకి తేవడమే తన ప్రధాన కర్తవ్యమని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామని.. కక్షిదారు, న్యాయవాది, న్యాయమూర్తికి అనువుగా ఉండే టెక్నాలజీని అమల్లోకి తెస్తామని చెప్పారు. తాను సుప్రీంకోర్టు ఈ-కోర్టు చైర్‌పర్సన్‌గా ఉన్నానని.. ప్రతి వ్యక్తికీ.. చివరకు టెక్నాలజీ అందుబాటులో లేనివారికి కూడా న్యాయసేవలు అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా గ్రామ పంచాయతీ స్థాయిలో న్యాయసేవలు అందించేందుకు కమిటీ కృషిచేస్తోందన్నారు. ఆలోచనాదృక్పథం మారితే టెక్నాలజీని అత్యుత్తమంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోని న్యాయమూర్తులు మిగతావారికి మార్గదర్శకులుగా నిలిచేలా పనిచేయాలని కోరారు. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతులను బలోపేతం చేయాలని.. కక్షిదారులకు అనుకూలంగా ఉండాలని అన్నారు. చట్టానికి మానవీయ కోణం తీసుకొచ్చిన న్యాయమూర్తిగా తాను గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని చీఫ్‌ జస్టిస్‌ తెలిపారు.

Updated Date - 2022-11-11T11:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising