ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Johnson & Johnson: పౌడర్ ఉత్పత్తి చేయండి, కానీ అమ్మడానికి లేదు

ABN, First Publish Date - 2022-11-16T17:28:08+05:30

ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ శాంపుల్స్‌ను తిరిగి టెస్టింగ్‌కు పంపాలని ముంబై హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది. పౌడర్ ఉత్పత్తి చేసుకోవడానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) బేబీ పౌడర్ శాంపుల్స్‌ను తిరిగి టెస్టింగ్‌కు పంపాలని ముంబై హైకోర్టు (Bombay High Court) బుధవారంనాడు ఆదేశించింది. పౌడర్ ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతిస్తూనే, అమ్మడానికి మాత్రం లేదని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15న లెసెన్సు రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలతో పాటు, సెప్టెంబర్ 20న బేబీ పౌడర్ ఉత్పత్తి, అమ్మకాలను నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను జాన్సన్ అండ్ జాన్సన్‌ కంపెనీ హైకోర్టులో సవాలు చేసింది. పౌడర్‌లో మోతాదుకు మిచి పీహెచ్ స్థాయి ఎక్కువ ఉందంటూ కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది. వీటిని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సవాలు చేయడంతో న్యాయమూర్తులు ఎస్‌వీ గంగాపూర్‌వాలా, ఎస్.జి.డిగోలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి తాజా ఆదేశాలిచ్చింది. ముంబైలోని ముంలంద్ ఏరియాలో ఉన్న కంపెనీ ఫ్యాక్టరీ నుంచి మూడు రోజుల్లోగా తిరిగి తాజా శాంపుల్స్ సేకరించాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినేష్ట్రన్‌ను డివిజన్ బెంచ్ ఆదేశించింది. శాంపుల్స్‌ పరీక్ష కోసం వాటిని రెండు ప్రభుత్వ ల్యాబొరేటరీటలకు, ఒక ప్రైవేటు ల్యాబరేటరీకి పంపాల్సి ఉంటుంది. అప్పటి నుంచి వారం రోజుల లోపు ఆ ల్యాబ్‌లు నివేదక సమర్పించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

కాగా, కంపెనీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రవి కదమ్ తన వాదన వినిపిస్తూ, కంపెనీకి పర్మిట్ ఇచ్చేలోపు కనీసం ఉత్పత్తిని ప్రారంభించేందుకు కోర్టు అనుమతించాలని కోరారు. బేబీ పౌడర్ అమ్మకాలు, డిస్ట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం నిరోధించిందని, ఆ ఉత్తర్వులకు కంపెనీ కట్టుబడి ఉందని అన్నారు. ఒకవేళ ఉత్పత్తి సాగించాలని కంపెనీ అనుకుంటే దానికి కంపెనీ రిస్క్ తీసుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి, సెప్టెంబర్ 2022 బ్యాచ్‌‌లను ఇండిపెండెంట్ పబ్లిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పరీక్షించిందని, నిర్ధారించిన పీహెచ్ స్థాయిలో ఉత్పత్తులు ఉన్నట్టు తేల్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. ములుంద్ ప్లాంట్‌లో 57 ఏళ్లుగా బేబీ పౌడర్‌‌ను కంపెనీ తయారు చేస్తోందని, 2020 జనవరిలో లైసెన్స్‌ రెన్యువల్ చేశామని చెప్పారు. లైసెన్స్ రద్దు కారణంగా మార్కెట్‌లో అమ్మకాల విలువ ఆధారంగా ప్రతిరోజూ రూ.2.5 కోట్ల చొప్పన నష్టం వస్తోందని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-16T17:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising