ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Crisis : చైనాలో కోవిడ్ విజృంభణ : రోగులకు నేలపైనే సేవలు... అలసిపోయి కుప్పకూలుతున్న వైద్యులు...

ABN, First Publish Date - 2022-12-21T15:21:42+05:30

సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారాన్నిబట్టి చైనాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది.

China Covid Crisis
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారాన్నిబట్టి చైనాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పలు తెప్పలుగా రోగులు వస్తుండటంతో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదని, వైద్యులు అలసిపోయి కుప్పకూలిపోతున్నారని సమాచారం. ఛాతీపై ఒత్తడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు నర్సులు, వైద్యులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది.

ఓ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో క్లిప్‌ను చూసినపుడు మనసు ఆవేదనతో నిండిపోతోంది. చోంకింగ్ నగరంలోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ అబ్జర్వేషన్ రూమ్‌లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. రోగులను నేలపైనే పడుకోబెట్టి, వారి ఛాతీపై నర్సులు, వైద్యులు నొక్కుతూ, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఆ గదిలోని పడకలన్నీ రోగులతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. రోగ తీవ్రత అధికంగా కలవారే ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోంది.

చైనీస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు ఆవేదన కలిగిస్తున్నాయి. రోగులకు చికిత్స చేసేందుకు వచ్చే వైద్యులు వారిని పరిశీలిస్తూనే నిద్రలోకి జారుకుంటున్నట్లు కనిపిస్తోంది.

కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న నిబంధనలపై నిరసనలు పెల్లుబకడంతో చైనా ప్రభుత్వం ఇటీవల దిగి వచ్చింది. అష్ట దిగ్బంధనాలు, సామూహిక పరీక్షలు, క్వారంటైన్లు, ట్రాకింగ్ వంటివాటిని నిలిపేసింది. ఈ నేపథ్యంలో చైనా వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభించింది. టీకాలు వేసుకొననివారు ఇప్పుడు బాధితులుగా మారుతున్నారు. పెరుగుతున్న రోగులకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు, ఇతర వైద్య సంస్థలలో తగిన ఏర్పాట్లు లేవు.

రోజువారీ నమోదయ్యే కొత్త కేసులు, మరణాల సంఖ్యను చాలా తక్కువగా చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ పరీక్షలను తగ్గించడం వల్ల కొత్త కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇదిలావుండగా, కోవిడ్ కారణంగా మరణించినట్లు ధ్రువీకరించే విధానాన్ని చైనా ప్రభుత్వం మార్చింది. శ్వాస తీసుకుని, వదలడంలో వైఫల్యం వల్ల రోగి మరణించినపుడు మాత్రమే కోవిడ్ మరణంగా గుర్తిస్తోంది. డిసెంబరు 20న ఈ వ్యాధి కారణంగా ఎవరూ మరణించలేదని బుధవారం ప్రకటించింది.

మరోవైపు చైనాలోని ప్రధాన నగరాల్లోని శ్మశాన వాటికలు క్రిక్కిరిసిపోతున్నాయని, అన్ని వేళలా పని చేస్తున్నాయని తెలుస్తోంది. మృతదేహాలను అధికారులు వెంటవెంటనే దహనం చేస్తున్నట్లు సమాచారం. చోంకింగ్ నగరంలోని ఓ శ్మశానవాటికలో శవాలను పెట్టేందుకు చోటు కరువైపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-21T15:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising