ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19: ప్రోటోకాల్ పాటించండి.. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్‌లో మోదీ

ABN, First Publish Date - 2022-12-25T14:43:08+05:30

చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, అమెరికా సహా పలు పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు.. తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ (Carona Virus) విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు కోరారు. ఈ ఏడాది చివరి 'మన్‌ కీ బాత్' (Mann ki baat)కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది వెకేషన్‌కు వెళ్తుంటారని, కరోనా బారిన పడకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతికదూరం వంటి ప్రొటోకాల్స్‌ను పాటించాలని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా జీరో-కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేయడంతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తోందని చెప్పారు.

భారతదేశం 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని, గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని ప్రధాని అన్నారు. ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్‌ను సాధించిందని చెప్పారు. అంతరిక్ష, రక్షణ, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామని అన్నారు. ఎంతో అద్భుతమైన సంవత్సరం 2022 అని, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాలతో అమృత్ కాల్ మొదలైందని, దేశం శీఘ్రగతిన పురోగతిన సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్యరంగంలో అనేక సవాళ్లను తాము అధిగమించామని, ఆటలమ్మ, పోలియా వంటి వ్యాధులను నిర్మూలించామని చెప్పారు. కాలా అజర్ వ్యాధిని తరిమికొట్టామని అన్నారు. ఇప్పుడు ఆ వ్యాధి బీహార్, జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు.

Updated Date - 2022-12-25T14:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising